సుమంత్ అశ్విన్ టాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలే అయినా… మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తూనీగ తూనీగ సినిమాతో హీరో అయిన సుమంత్ ఆ తర్వాత కేరింత – లవర్స్ సినిమాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ రెండు సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నా ఆ తర్వాత సుమంత్ చేసిన సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర ఆశించినంతగా ఆడలేదు. దీంతో బాక్సాఫీస్ రేసులో వెనకపడిపోయాడు.
సుమంత అశ్విన్ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ ప్రేమ పెళ్లి ఎలా ? జరిగిందో సుమంత్ ఓ సందర్భంలో చెప్పాడు. సుమంత్ తన భార్యను తొలిసారిగా కజిన్ పెళ్లిలో చూశాడట. ఆమెపై వెంటనే మాంచి ఒపీనియన్ ఏర్పరుచుకున్నాడట. అదే టైంలో సుమంత్ ఇంట్లో తనకు పెళ్లి చేయాలని చూస్తున్నారట. అప్పుడు పెళ్లంటూ చేసుకుంటే దీపికను మాత్రమే చేసుకుంటే బాగుంటుందని డిసైడ్ అయ్యి నేరుగా ఆమెకే ఫోన్ చేశాడట.
తాను నిన్ను పెళ్లి చేసుకుంటానని దీపికకు చెప్పడంతో పాటు ఇటు తన తల్లిదండ్రులకు కూడా చెప్పేశాడట. పెళ్లయ్యాక సుమంత్ సినిమాల్లో బిజీగా ఉండడంతో దీపిక అమెరికాకు వెళ్లిపోయిందట. అయితే తమ ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో చిన్న చిన్న వాదోపవాదాలు జరుగుతాయి తప్పా గొడవలు జరగవని సుమంత్ చెప్పాడు.
ఇక తాము పెళ్లి తర్వాత కూడా దూరంగా ఉండడం వల్లే ఇద్దరికి ఒకరిపై మరొకరికి ప్రేమ మరింత పెరిగిందని దీపిక చెప్పింది. తాము దూరంగా ఉన్నా ఇది తాత్కాలికమే అని.. సుమంత్ అందరి అభిప్రాయాలను ఎంతో గౌరవిస్తాడని దీపిక చెప్పింది.