Moviesనన్ను వదిలేసినందుకు థాంక్స్..ఓపెన్ గా చెప్పేసిన శ్రీజ..!!

నన్ను వదిలేసినందుకు థాంక్స్..ఓపెన్ గా చెప్పేసిన శ్రీజ..!!

ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే విడాకులు తీసుకుంటున్న భార్యభర్తల లిస్ట్ రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీల హోదాలో ఉండి .. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన జంటలు..చిన్న చిన్న కారణాల చేతనే విడాకులు తీసుకుంటూ అభిమానులకు ఊహించని షాకులు ఇస్తున్నారు. ఇక్కడ మరో చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇలా విడాకులు తీసుకుంటున్న వారిలో ఎక్కువ స్టార్ కిడ్స్ ఉండటం గమనార్హం.

ఎవ్వరు ఊహించని విధంగా చైతన్య సమంత విడాకులు తీసుకుని అభిమానులకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఆ షాక్ నుండి తేరుకోకముందే..రజనీకాంత్ కూతురు..కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా విడాకులు తీసుకోబోతున్నం అంటూ ప్రకటించి అభిమానులకు మరో షాక్ ఇచ్చారు. ఇక ఇదే లిస్ట్ లోకి చేరిపోయింది టాలీవుడ్ మెగాస్టార్ ముద్దుల డాటర్ శ్రీజ. అమ్మడుకి పెళ్లిలు కలిసొచ్చిన్నట్లు లేవు..అందుకే కాబోలు మొదట భర్తకు విడాకులిచ్చి రెండొ పెళ్లి చేసుకుని..రెండో బిడ్డకు కూడా జన్మనిచ్చిన తరువాత ఈమె తన రెండో మొగుడికి విడాకులు ఇస్తుంది అంటున్నారు నెటిజన్స్.

అధికారికంగా ప్రకటించకపోయిన..శ్రీజ తన రెండో భర్త కళ్యాణ్ దేవ్ కు విడా కులు ఇవ్వడానికి రెడీ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గటే అమ్మడు సింగిల్ శ్టేటస్ ఇమేజులు పెట్టడం..సోషల్ మీడియా అకౌంట్స్ లో భర్త పేరుని తొలగించడం..పరోక్షంగా కళ్యాణ్ దేవ్ కు కౌంటర్ ఇవ్వడం వంతి పోస్ట్లు చేస్తుంది. ఇక రీసెంట్ గా..బ్రదర్ చరణ్ తో కలిసి ముంబైకు వెళ్లింది. అయితే అనూహ్యంగా వీళ్లు మీడియాకు చిక్కారు. అయితే మీడియా తో మాట్లాడటానికి ఇష్టపడని వీళ్లు..సైలెంట్ గా కారు ఎక్కి వెళ్ళిపోయారు.

తాజాగా శ్రీజ పెట్టిన పోస్ట్ కు వాళ్ల అక్క సుస్మిత పెట్టిన కామెంట్ వైరల్ గా మారింది. చరణ్ తో దిగ్గిన ఫోటోను షేర్ చేస్తూ శ్రీజ..”హగ్స్.. ఇవే నేను ఇంకా సంతోషంగా బ్రతికుతున్నందుకు కారణాలు’ అని పోస్ట్ చేసింది శ్రీజ. ఇక ఈ క్యాప్షన్ కు అక్క సుస్మిత కొణిదెల ‘నన్ను వదిలేసి వెళ్లిపోయినందుకు థాంక్స్’ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ స్టార్ డాటర్స్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Sreeja (@sreejakonidela)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news