సీనియర్ ఎన్టీఆర్‌కు మొత్తం 11 మంది సంతానం. వీరిలో ఏడుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. అమ్మాయిల విషయానికి వస్తే కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి, గారపాటి లోకేశ్వరి. ఇక ఏడుగురు కుమారులు ఉన్నారు. వీరిలో బాలయ్య మాత్రమే ఎన్టీఆర్ నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చి హీరో అయ్యాడు. ఆ తర్వాత హరికృష్ణ కూడా సినిమాలు చేసినా బాలయ్య స్టార్ హీరోగా ఇప్పటకీ వెలుగొందుతున్నాడు.
ఇక బాలయ్య పెళ్లి ఎలా జరిగింది ? అన్నది చూస్తే కాస్త చిత్రవిచిత్రంగానే ఉంటుంది. అప్పుడే ఎన్టీఆర్ సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. ఆ సమయంలో బాలయ్యకు పెళ్లి చేసేయాలని భార్య బసవతారకం ఎన్టీఆర్‌పై ఒత్తిడి చేశారట. కొన్ని సంబంధాలు చూసిన ఎన్టీఆర్ చివరకు బాలయ్యకు పెళ్లి చేసే బాధ్యతను అప్పుడు ఎన్టీఆర్ మిత్రుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు అప్పగించారట.
నాదెండ్ల కాకినాడలో ఉన్న తమ దూరపు బంధువుల అమ్మాయి అయిన వసుంధరను చూడాలని నిర్ణయించున్నారట. బాలయ్యతో పాటు కుటుంబ సభ్యులు అందరూ వెళ్లి పెళ్లిచూపుల్లో వసుంధరను చూసి సంబంధం ఓకే చేశారట. వసుంధర ఎవరో కాదు శ్రీరామదాసు ట్రాన్స్‌పోర్ట్స్ అధినేత దేవరపల్లి సర్యారావు కుమార్తె. వీరి వివాహం 8 డిసెంబర్, 1982 న జరిగింది.
అయితే అప్పట్లోనే దేవరపల్లి సూర్యారావు తన కుమార్తెకు రు. 10 లక్షలు నగదు ఇచ్చారట. ఎన్టీఆర్ ఆ నగదుతోనే హైదరాబాద్‌లో ఉన్న ఇంటి నిర్మాణం కోసం వాడారని నాదెండ్ల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ అంతటా కొత్త పార్టీ పెట్టి ప్రచారం చేస్తోన్న ఎన్టీఆర్ బాలయ్య పెళ్లికి కూడా వెళ్లలేదు. నాదెండ్ల కొడుకు పెళ్లికి వెళ్లపోతే బాగోదు… వెళ్లి భోజనం చేసి అక్షింతలు వేసి వద్దామని రిక్వెస్ట్ చేసినా ఎన్టీఆర్ వినలేదట.
అలా బాలయ్య పెళ్లి జరిగింది. ఈ దంపతులకు బ్రాహ్మణి, తేజస్విని కుమార్తెలతో పాటు కుమారుడు మోక్షజ్ఞ ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ చిన్నప్పుడే లోకేష్ – బ్రాహ్మణి దంపతులకు పెళ్లి చేయాలని అనేవారట. చివరకు అదే నిజం అయ్యి 2007లో వీరి పెళ్లి జరిగింది.