టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా హిట్ అయ్యాక ఈ కాంబినేషన్లో మరో సినిమా చేసేందుకు హారిక & హాసిని క్రియేషన్స్ డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలోనే హారిక వాళ్లు.. ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఎన్టీఆర్ 30వ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చింది. అయినను పోయి రావలె హస్తినకు అన్న టైటిల్ అనుకుంటున్నారన్న ప్రచారం కూడా జరిగింది.
ఆ తర్వాత సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకుంటోన్న టైంలో కరోనా రావడంతో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతోనే ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యింది. ఆ వెంటనే ఎన్టీఆర్ తన 30వ ప్రాజెక్టును కొరటాల శివతో కమిట్ అయిపోయాడు. యువసుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను పట్టాలెక్కించేస్తున్నాయి. ఇక త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్‌బాబుతో తాను తెరకెక్కించే సినిమాతో పాటు భీమ్లానాయక్ మీదే కాన్‌సంట్రేషన్ చేస్తున్నాడు.
ఇక ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా ఉండదన్న ప్రచారమే జరిగింది. ఈ ప్రచారంపై సితార అధినేత సూర్యదేవర నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. డీజే టిల్లు ప్రమోషన్స్‌లో ఆయన మాట్లాడుతూ త్రివిక్రమ్ – ఎన్టీఆర్ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యిందన్న వార్తలు ఒట్టి పుకార్లు అని చెప్పేశారు. ఎన్టీఆర్‌తో సినిమాకు త్రివిక్రమ్ వేసుకున్న సబ్జెక్ట్ చాలా పెద్దది అని.. అయితే అది ఈ టైంలో చేసే టైం లేదనే వాయిదా వేసుకున్నామని చెప్పారు.
ఈ సబ్జెక్ట్ తారక్‌కు మాత్రమే బాగా సూట్ అవుతుందని.. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మధ్య ఎలాంటి విబేధాలు లేవని.. ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉందని.. త్వరలోనే ఇద్దరూ కలిసి పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా చేయబోతున్నారని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరు వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో వీరు ఫ్రీ అయ్యాక ఈ సినిమా పట్టాలు ఎక్కే ఛాన్స్ ఉంది.