మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘అయ్యపనుమ్ కోషియుమ్’ అనే సినిమాను తెలుగులో “భీమ్లా నాయక్ ” అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. నిజానికి ఇది రీమేక్ సినిమా అయినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా నటిస్తున్న “భీమ్లా నాయక్” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్. చాలా రోజుల తరువాత త్రివిక్రమ్ పవన్ కల్యాణ్ సినిమాకి డైలాగ్స్ రాశారు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రమోషన్‌లో భాగంగా చిత్రయూనిట్ నిన్న హైదరాబాద్ యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నటీనటులు, సిబ్బంది అంతా హాజరయ్యారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని రావడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. అయితే ఎంత మంది ఉన్నా కానీ ఈ వేడుకలో పవన్ పక్కన హీరోయిన్ గా నతీంచిన నిత్యా మీనన్ రాకపోవడం ప్రీ రీలీజ్ ఈవెంట్ కు మైనస్ అయ్యింది. అయితే అదే టైంలో రానా భార్య నటించిన మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్..మాట్లాడినా మాటలు హైలెట్ గా నిలిచాయి.
ఈ ఈవెంట్ లో సంయుక్త ఎక్కువుగా తెలుగులోనే మాట్లాడటం అభిమానులకు బాగా నచ్చింది. పైగా ఆమె మాట్లాడే ప్రతి పదాని క్లీయర్ గా స్పష్టంగా అర్ధమైయ్యేలా పలుకుతుంది. దీనికి తోడు అమ్మడు వాయిస్..ఎంత బాగుంది అంటే వినే కొద్ది వినాలి అని అనిపిస్తుంది.
ఇక ఆమె స్పీచ్ మెయిన్ హైలెట్ గా నిలిచింది పవన్ ఎప్పుడు చెప్పే డైలాగ్.” ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు.. చేతిలో దీపం లేదు.. కానీ నా ధైర్యమే కవచం.. నా ధైర్యమే ఆయుధం..” అనే డైలాగ్ చెప్పి భీమ్లానాయక్ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నానని స్పీచ్ ముగించింది.
ఇక దీంతో అమ్మడు స్పీచ్ విన్న ఫ్యాన్స్ బండ్ల గనేష్ లేని లోటు నువ్వు తీర్చావా తల్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్, భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. మాస్ లో సాలిడ్ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే మాస్ లో ఈ చిత్రంకి భారీ హైప్ కూడా ఇప్పుడు నెలకొంది. ఈ మూవీకి ఎస్.ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.