Moviesత్వరలోనే గుడ్ న్యూస్..అభిమానులకు కిక్కెక్కించే వార్త చెప్పిన సోనూ..!!

త్వరలోనే గుడ్ న్యూస్..అభిమానులకు కిక్కెక్కించే వార్త చెప్పిన సోనూ..!!

సోనూసూద్..ఒకప్పుడు ఈ పేరు వింటే అందరికి గుర్తువచ్చేది..జాలీ దయలేని ఓ రాక్షస విలన్. అందరు ఇదే అనుకునే వారు. సోనూసూద్ ఇంత దుర్మార్గుడా..ఇలాంటి పనులు చేసాడా అని అనుకునేవారు. అది ఆయన తప్పు కాదు. డైరెక్టర్స్ ఇచ్చిన పాత్రల్లో ఆయన అలా నటించేవారు. ఏ పాత్రకు అయినా ప్రాణం పోసే ఈయన.. కరోనా కాలంలో ఎంతో మంది ప్రణాలను కాపాడి రీయల్ హీరో అయిపోయారు.

లాక్‌డౌన్ వేళ దేశం స్తంభించిపోతే సోను దేశ‌వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది పేద కార్మికుల‌ను, వ‌ల‌స కూలీల‌ను ఆదుకున్నాడు. ఇక వ‌ల‌స కూలీలు వారి వారి స్వ‌స్థలాల‌కు వెళ్లేందుకు బ‌స్సులు ఏర్పాటు చేశారు. మ‌రి కొంత‌మందికి స్పెష‌ల్ ఫ్లైట్లు ఏర్పాటు చేసి మ‌రీ వారు వారి స్వ‌స్థ‌లాల‌కు వెళ్లేలా చేశాడు. కరోనా మహమ్మారి తాండవించిన సమయంలో బాలీవుడ్​ నటుడు సోనూసూద్ చాలా మందికి అండగా నిలిచాడు.

వందలాది మందికి సాయం అందించారు. ఈ సేవాగుణం కారణంగా దేశవ్యాప్తంగా ఆయనకు లక్షలాది మంది అభిమానులు అయిపోయారు. పెద్దపెద్ద సెలెబ్రెటీలు సైతం ఆయనను ప్రశంసించారు.సోను బాలీవుడ్‌లోనే కాదు సౌత్ సినీ అభిమానుల‌కు కూడా ఎంతో సుప‌రిచిత‌మే. ఇప్పుడు ఈయన పేరు చెబితే చేతులు దండం పెట్టని మనిషి అంటూ లేరు. ఎటువంటి స్వార్ధం లేకుండా నిజాయితీగా ప్రజలకు హెల్ప్ చేసి కలియుగ దేవుడు అయిపోయాడు సోనూసూద్.

అయితే తాజాగా సోనూ ఆయన అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. త్వరలో మీ అందరికీ ఫన్, మస్తీతో రాబోతున్నానని రియల్ హీరో సోనూసూద్ తెలిపారు. ఇప్పటికీ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సోనూసూద్‌ ఇప్పుడు హోస్ట్‌గా మారబోతున్నాడు. ఇంతకాలం తెలుగు, హిందీ భాషలలో పలు కీలక పాత్రల్లో నటించి పాపులర్ అయిన ఆయన మొదటిసారి ఓ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు.

తన సోషల్ మీడియాలో రోడ్ సైడ్ ఓ షాప్ లో సమోసా తింటూ ఓ వీడియో షేర్ చేశారు సోనూ. ఆ వీడియోలో.. ”త్వరలో మీ అందరికీ ఫన్‌, మస్తీ అందించేందుకు అడ్వెంచరస్‌ షోతో మీ ముందుకు వచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. రోడీస్ కొత్త సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరించనున్నాను. నా జీవితంలో ఇది ఒక కొత్త అడ్వెంచర్‌’’ అని తెలిపారు. ఈ రోడీస్ రియాలిటీ షోను ఫిబ్ర‌వ‌రి 2 వారం నుంచి షూట్ చేయ‌బోతున్నారు. అలాగే మార్చి నుంచి ప్ర‌సారం కానుంది. ఇది వ‌ర‌కు ఈ రియాలిటీ రోడీస్ షోను ర‌ణ్ విజ‌య్ సింఘ హోస్ట్ చేస్తూ వ‌చ్చారు. ఇప్పుడు సోనూసూద్ హోస్ట్ కావ‌డం అనేది షోకు క‌చ్చితంగా క్రేజ్ పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు.

 

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news