ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్,రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై కొట్లాది మంది అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సినిమా జనవరీ 7న రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా కరోనా విజృంభించడంతో పలు రాష్ట్రాలు మళ్ళీ కరోనా ఆంక్షలు అమలు లోకి తీసుకురావడంతో ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చినా ఈ సినిమా మరోసారి వాయిదా పడింది.
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు. రామ్‌చరణ్ అగ్గిపిడుగు అల్లూరిగా గర్జిస్తే.. ఎన్టీఆర్ గోండు బెబ్బులి అల్లూరి సీతారామరాజుగా విజృంభించాడు. ఇక సుమారు 450 కోట్లా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కింది. మూడేళ్ల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తోన్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు మేకర్స్. ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.
అయితే నిజానికి ఈ సినిమాని ఫస్ట్ మార్చి 18 లేదా ఏప్రిల్ 28 తేదీలలో రిలీజ్ చేస్తానని చెప్పిన రాజమౌళి ఆ తర్వాత ఎవ్వరు ఊహించని విధంగా మార్చి 25వ తేదీకి రిలీజ్ డేట్ ను మార్చారు. దీంతో ఆ తేదీలో రిలీజ్ అవ్వాలి అనుకున్న సినిమాలకు ఇప్పుడి ఇది పెద్ద సమస్య గా మారింది.రాజమౌళి తీసుకున్న నిర్ణయం వల్ల తెలుగులో అదే తేదీకి రిలీజ్ కావాల్సిన రామారావ్ ఆన్ డ్యూ టీ సినిమాకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే ఆర్ ఆర్ ఆర్ ధాటికి మనం తట్టుకోలేం అనుకున్నారో ఏమో కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రామరావ్ ఆన్ డ్యూటీ సినిమాను ఏప్రిల్ 15వ తేదీన రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారట మేకర్స్.
అయితే ఇక్కడ వచ్చిన మరో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమిటంటే..తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన డాన్ సినిమాను కూడా మొదట మార్చి 25వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసారు. కానీ రాజమౌళి ఊహించని నిర్ణయంతో ఆ చిత్ర నిర్మాతలు ఎటు తేల్చుకోలేని పొజీషన్ లో ఉన్నారట. ఇక అ మధ్య ఆర్ ఆర్ ఆర్ ఈవెంట్ కి కూడా ఆయనను స్పెషల్ గెస్త్ గా అహ్వానించారు రాజమౌళి. దీంతో శివ కార్తికేయన్ కు జక్కన్నా భారీ షాక్ ఇచ్చాడంటూ అభిమానులు కమెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు రాజమౌళి వెన్నుపోటు పొడిచాడని శివ కార్తికేయన్ ని అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్ల గురించి జక్కన్న ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..!