సినిమా ఇండస్ట్రీలో ఒకరు అనుకున్న టైటిల్‌తో మరో హీరో సినిమా చేసి హిట్లు కొడుతూ ఉండడం కామన్. అలాగే ఒక హీరో కోసం అనుకున్న టైటిల్‌తో అనుకోకుండా మరో హీరో సినిమా చేయాల్సి వస్తుంది. మరి కొందరు హీరోలు తమ సినిమా కోసం అనుకున్న టైటిల్‌ను మరో హీరో కోసం త్యాగం చేస్తూ ఉంటారు. ఉదాహరణకు రవితేజ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో కత్తి సినిమా అనుకున్నారు. ఆ తర్వాత కళ్యాణ్‌రామ్ కూడా అదే టైటిల్ అనుకోవడంతో చివరకు ఆ టైటిల్ కళ్యాణ్‌రామ్‌కు వదిలిపెట్టి గుణశేఖర్ తన సినిమాకు నిప్పు టైటిల్ పెట్టుకున్నారు.
ఇక పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తమ్ముడు డిఫరెంట్ సినిమా. కోడి రామకృష్ణ శిష్యుడు పీఏ. ఆరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో కిక్ బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కథ, కథనాలు, పవన్ కళ్యాణ్ స్టైలిష్ నటన, దర్శకుడి ప్రెష్ టేకింగ్. ప్రీతి జింగానియా, అతిధి గోవికర్ అందాలు.. రమణ గోగుల పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమాకు హైలెట్ అయ్యాయి. బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్ హీరోగా వచ్చిన సినిమా స్ఫూర్తితో తమ్ముడు సినిమా తెరకెక్కింది.
అయితే హిందీలో ఆ సినిమా సైక్లింగ్ నేపథ్యంలో ఉంటుంది. సైక్లింగ్ నేపథ్యం మన వాళ్లకు సూట్ కాదని.. కొత్తగా ఉంటుందని బాక్సింగ్ నేపథ్యం ఎంచుకున్నారు. అదే సినిమాను సగం హిట్ చేసేసింది. ఇక ఇద్దరూ కొత్త హీరోయిన్లనే తీసుకున్నారు. ఈ సినిమాకు తమ్ముడు అనే టైటిల్ అనుకున్నారు. అయితే అంతకుముందే ఈ టైటిల్‌ను నాగార్జున సినిమా కోసం రిజిస్టర్ చేసుకున్నారు.
వైవీఎస్. చౌదరి దర్శకత్వంలో హరికృష్ణ – నాగార్జున కాంబోలో వచ్చిన సీతారామరాజు సినిమాకు ముందుగా తమ్ముడు టైటిల్ అనుకున్నారు. అయితే తమ్ముడు టైటిల్ కావాలని దర్శకుడు పీఏ. ఆరుణ ప్రసాద్ అడగడంతో నాగార్జున ఇచ్చేశారు. అలా తమ్ముడు సినిమా సూపర్ హిట్ అయ్యింది. అప్పట్లో తమ్ముడు టైటిల్‌తో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే.. అన్న చిరు అన్నయ్య టైటిల్‌తో సినిమా చేశారు. ఈ రెండూ హిట్ అయ్యాయి.