టాలీవుడ్‌లో హీరోల రెమ్యునరేషన్లు బాగా పెరిగిపోతున్నాయి. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. శాటిలైట్, డిజిటల్ రైట్స్ రేట్లు పెరగడంతో పాటు డబ్బింగ్ రైట్స్, ఓటీటీల ద్వారా కూడా నిర్మాతలకు నాలుగు రూపాయలు వస్తున్నాయి. దీంతో హీరోలు కూడా ఎక్కడా రాజీపడకుండా భారీగానే వసూలు చేస్తున్నారు. అయితే కొందరు హీరోలు మరీ మితిమీరిన రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ నిర్మాతలకు చుక్కలు చూపించేస్తున్నారు.
అఖండ సినిమా తరవాత దర్శకుడు బోయపాటి శ్రీను ఎవరితో సినిమా చేస్తారన్న ప్రశ్నల నేపథ్యంలో యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పేరు తెరమీదకు వచ్చింది. రామ్ – బోయపాటి కాంబినేషన్లో సినిమా పట్టాలు ఎక్కడానికి మంచి ముహూర్తమే తరువాయి అనుకుంటోన్న టైంలో ఇప్పుడు బోయపాటి సినిమాకు కొత్త చిక్కే వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అఖండ తర్వాత బోయపాటి డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావడంతో ఆయనకు నిర్మాతలు రు. 15 కోట్లు ఇస్తామని డీల్ ఓకే చేసుకున్నారట. అయితే ఇప్పుడు రామ్ కూడా తనకు రు. 15 కోట్లు ఇవ్వాల్సిందే అని పంతానికి పోయి కూర్చున్నాడట. హీరో, డైరెక్టర్లకే రు. 30 కోట్లు పోతే.. ఇక హీరోయిన్లు, ఇతర కాస్టింగ్, ప్రొడక్షన్ కాస్ట్ అన్ని కలుపుకుంటే సినిమా బడ్జెట్ రు. 100 కోట్లు దాటేస్తుందని నిర్మాతలు డైలమాలో పడిపోయారు.
అసలే బోయపాటి ప్రొడక్షన్ అంటే మామూలుగా ఉండదు. అంతా భారీతనమే..! అందుకే ఇప్పుడు రామ్ సినిమా పట్టాలు ఎక్కుతుందా ? రామ్ మెట్టు కిందకు దిగుతారా ? లేదా ? అన్నదానిమీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఏదేమైనా రామ్ కొత్త రేటుతో ఇండస్ట్రీ వాళ్లకు, నిర్మాతలకు చుక్కలు చూపించేస్తున్నాడు.