టాలీవుడ్‌లో సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు దగ్గుబాటి రానా. ఈ వంశంలో దివంగత లెజెండ్రీ నిర్మాత రామానాయుడు భారతదేశంలో అన్ని భాషల్లోనూ సినిమాలు తీసిన నిర్మాతగా రికార్డులకు ఎక్కారు. ఆ తర్వాత ఆయన వారసులుగా రెండో తరంలో ఎంట్రీ ఇచ్చారు ఆయన తనయులు వెంకటేష్, సురేష్‌బాబు. వీరిలో సురేష్‌బాబు తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ అగ్ర నిర్మాతగా ఉన్నారు. ఇక వెంకటేష్ టాలీవుడ్‌లో స్టార్ హీరోలలో ఒకరిగా దశాబ్దాలుగా తన స్టార్ డమ్ కంటిన్యూ చేస్తూ వస్తున్నారు.
ఇక ఈ వంశంలో మూడో తరం వారసుడిగా సురేష్‌బాబు తనయుడు రానా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బాహుబలి దెబ్బతో రానా నేషనల్ స్టార్ అయిపోయాడు. రానా ఎంచుకునే సబ్జెక్టులే రానాకు నేషనల్ లెవల్లో క్రేజ్ తెచ్చిపెట్టాయి. బాహుబలిలో భల్లాలదేవుడిగా పవర్ ఫుల్ విలన్ పాత్రలో రానా భీకర నట విశ్వరూపం చూపించాడు. ఇక రానా లేట్ ఏజ్‌లో మిహికా బజాజ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు.
కోవడ్ నేపథ్యంలో వీరి పెళ్లి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్‌గానే జరిపించాడు సురేష్‌బాబు. తెలుగు మూలాలు ఉండి బాలీవుడ్‌లో స్థిరపడింది మిహికా కుటుంబం. ఆమె ఓ ఈవెంట్ డిజైనర్. బిజినెస్ రంగంలో నైపుణ్యం ఉన్న మిహికా దగ్గుబాటి కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చాక ఆమె కూడా దగ్గుబాటి కుటుంబ వ్యాపారాలు కొన్నింటిని చూసుకుంటోంది.
సంతోషంగా సాగుతోన్న వీరి వైవాహిక జీవితంలో ఓ విషయంలో మాత్రం ఇద్దరి మధ్య ఓ విషయంలో మాత్రం అప్పుడప్పుడూ గొడవ జరుగుతోందన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వీరి పెళ్లి జరిగి రెండేళ్లు అవుతోంది. కుటుంబ సభ్యులు మాత్రం పిల్లలు కావాలని ప్రెజర్ చేస్తున్నారట. అయితే మిహికాకు మాత్రం అప్పుడే పిల్లలు ఇష్టం లేదట.
మరో ఒకటి రెండేళ్లు కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాకే పిల్లలను ప్లాన్ చేసుకోవాలని మిహికా ప్లాన్ చేస్తోందట. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ మాత్రం పిల్లలను కనేస్తే బాగుంటుందని భావిస్తోందట. ఈ విషయంలో రానా ఇటు మిహికాకు, అటు దగ్గుబాటి ఫ్యామిలీకి సర్దిచెప్పే విషయంలో తర్జన భర్జనలు పడుతున్నట్టు ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్ టాక్ ? మరి ఇందులో వాస్తవ అవాస్తవాలపై వాళ్లు క్లారిటీ ఇస్తే తెలుస్తోంది.