Moviesబాల‌య్య రికార్డులు అన్‌స్టాప‌బుల్‌... న‌ట‌సింహం మ‌రో ఘ‌న‌త‌

బాల‌య్య రికార్డులు అన్‌స్టాప‌బుల్‌… న‌ట‌సింహం మ‌రో ఘ‌న‌త‌

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ జోరు మామూలుగా లేదు. వ‌రుస పెట్టి త‌న ఖాతాలో ఏదో ఒక రికార్డు వేసుకుంటూనే పోతున్నాడు. అఖండ సినిమా రిలీజ్‌కు ముందు నుంచి జ‌నాల‌కు బాల‌య్య పూన‌కం ప‌ట్టేసింది. బాల‌య్య ఏం చేసినా ఏదో ఒక సంచ‌ల‌నం అవుతూనే ఉంది. ఏదో ఒక రికార్డు న‌మోదు అవుతోంది. అఖండ ఏకంగా 103 కేంద్రాల్లో 50 రోజులు ఆడ‌డ‌మే ఓ సంచ‌ల‌నం అనుకుంటే.. ఆ సినిమాకు ఓవ‌రాల్‌గా రు. 200 కోట్ల వ‌సూల్లు వ‌చ్చాయి. అస‌లు బాల‌య్య సినిమాకు ఈ వ‌య‌స్సులో .. ఓ మోస్త‌రు టాక్‌తోనే ఈ రేంజ్‌లో వ‌సూళ్లు రావ‌డం జ‌నాల‌కే మైండ్ బ్లాక్ చేసింది.

ఇండ‌స్ట్రీ అయితే షాక్ అయిపోయింది. వెండితెర‌ను బాల‌య్య ఈ వ‌య‌స్సులో ఇలా ఏలేయ‌డం ఏంట్రా బాబు అని చాలా మంది త‌ల‌లు ప‌ట్టుకుంటే.. ఇటు బుల్లితెర‌ను కూడా బాల‌య్య దున్ని ప‌డేస్తున్నాడు. బాల‌య్య హోస్ట్ చేసిన అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే టాక్ షో రెండు నెల‌లుగా తెలుగు సోష‌ల్ మీడియ‌మఆను ఊపేస్తోంది. జ‌నాలు అంద‌రూ కూడా అన్‌స్టాప‌బుల్ మానియాలో మునిగి తేలుతున్నారు.

ఇప్ప‌టికే ఐఎండీబీలో ఈ టాక్ షో మాంచి రేటింగ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో అత్య‌ధిక మంది వీక్షించిన టాక్ షోగా కూడా ఇది రికార్డుల‌కు ఎక్కింది. ఈ క్ర‌మంలోనే ఫ‌స్ట్ సీజ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు 40 కోట్ల‌కు పైగా నిమిషాలు ప్ర‌సారం అయ్యి స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసింద‌ని టీం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఎన్నో స‌రికొత్త రికార్డుల‌తో ఈ షో మొత్తానికి స‌క్సెస్ ఫుల్‌గా ఫ‌స్ట్ సీజ‌న్ కంప్లీట్ చేసుకుంది.

ఫ‌స్ట్ సీజ‌న్ మ‌హేష్‌బాబు ఎపిసోడ్‌తో విజ‌య‌వంతంగా ముగిసింది. ఇక ఈ షో రెండో సీజ‌న్ జూలై నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని కూడా టీం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇక అఖండ విజ‌యం త‌ర్వాత బాలయ్య మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news