ఈ మధ్య కాలంలో ప్రేక్షకులకు నచ్చి బాగా హిట్ అయినా పాటలు చాలానే ఉన్నాయి. కాని అందులో ఓ సాంగ్ మాత్రం దుమ్ము దులిపేసింది. ఎంతలా అంటే ఇంట్లో ని చిన్న పిల్లల దగ్గర నుండి ..పండు ముసలి వాళ్ల వరకు అందరూ ఈ పాటను తెగ ఎంజాయ్ చేశారు. ఆ పాట ఏంటో ఇప్పటికే మీకు అర్ధం అయిపోయుండాలే..హా..యస్ అదే సమంత తన కెరీర్ లోనే ఫస్ట్ టైం ఐటెం సాంగ్ గా చేసిన “ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ”..!!
ఈ పాట ఏ మూహుర్తాన రిలీజ్ అయ్యిందో కానీ..అప్పటి నుండి ప్రతి ఫంక్షన్ లోను..సంగీత్ లోను, పలు ఈవెంట్స్ లోను..ఒకటా రెండా అన్ని చోట్లా పాటను ప్లే చేస్తూ..పూనకాలు వచ్చిన్నట్లు ఊగిపోతున్నారు. ఇక ఈ పాటలోని లిరిక్స్ వల్ల కొందరు మగవాళ్ళు హర్ట్ అయ్యారని..చంద్రబోస్ పై ఫైర్ అయ్యి..ఈ పాటను సినిమాలో నుంచి తీసేయ్యాలి అని బాగా డిమాండ్ చేశారు. కానీ సుకుమార్ తగ్గేదేలే అన్నట్లు పాటను డిజైన్ చేసాడు. ఈ పాటలో సమంత ఇదివరకు ఎన్నడు లేనంత హాట్ గా కనిపించడం సినిమకి మరో ప్లస్ అయ్యింది.
అయితే రీసెంట్ గా , ఈ పాటలోని లిరిక్స్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మకి బాగా సెట్ అవుతాయి అంటూ నెట్టింట ట్రోలింగ్ చేస్తున్నారు. అందుకు కారణం..రీసెంట్ గా ఆయన మాట్లాడిన మాటలే. ‘బడవ రాస్కెల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా యాంకరింగ్ చేస్తున్న శ్యామలపై ఊహించని కామెంట్స్ చేసారు. ముందుగా ఆయన స్టేజీ పైకి రాగానే నిజంగా నేను రాస్కెల్ ని..ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్లలోంచి ఇప్పటివరకు ఎలా తప్పించుకున్నారు’ అంటూ ప్రశ్నించారు. దీంతో ఒక్కక్షణం షాక్ అయిన శ్యామల తెగ నవ్వేసింది. అయితే శ్యామల ఈ విషయాని లైట్ గా తీసుకున్నప్పటికి..కొందరు నెటిజన్స్ మాత్రం రాం గోపాల్ వర్మ పై ఫైర్ అవుతున్నారు. పెళ్లై ఓ బాబు ఉన్న ఆడదాని కూడా నువ్వు వదలవా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అయితే పుష్ప పాటలోని లిరిక్స్ ని మ్యాచ్ చేస్తూ..”నీ కళ్లలోనే అంతా ఉంది..నీ బుద్ధి వంకర బుద్ధి” అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.