Moviesన‌న్ను ఆ ఇద్ద‌రు హీరోలు టార్గెట్ చేస్తున్నారు... సంచ‌ల‌నంగా మోహ‌న్‌బాబు వ్యాఖ్య‌లు..!

న‌న్ను ఆ ఇద్ద‌రు హీరోలు టార్గెట్ చేస్తున్నారు… సంచ‌ల‌నంగా మోహ‌న్‌బాబు వ్యాఖ్య‌లు..!

ఎవ‌రు ఔన‌న్నా.. ఎవ‌రు కాద‌న్నా కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో హీరోల మ‌ధ్య ఏదో తెలియ‌ని గ్యాప్ నెల‌కొంది. మా ఎన్నిక‌ల‌కు ఓ నెల రోజుల ముందు నుంచే ఈ వార్ మ‌రింత‌గా పెరుగుతూ వ‌స్తోంది. తాజాగా మోహ‌న్‌బాబు న‌టిస్తూ, నిర్మిస్తోన్న స‌న్ ఆఫ్ ఇండియా సినిమా ఫంక్ష‌న్లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ సినిమాకు ర‌చ‌యిత డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌కుడు. ఈ నెల 18న రిలీజ్ అవుతోన్న నేప‌థ్యంలో జ‌రిగిన ప్రి రిలీజ్ ఫంక్ష‌న్లో మోహ‌న్‌బాబు మాట్లాడుతూ నా మీద ఇద్ద‌రు హీరోలు ట్రోలింగ్ చేయిస్తున్నాన‌రు.. ఇందుకోస‌మే వారు 50 -100 మందిని ప్ర‌త్యేకంగా పెట్టుకుని మ‌రీ న‌న్ను ట్రోల్ చేయ‌డ‌మే టార్గెట్‌గా పెట్టుకున్నార‌ని వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

మా ఎన్నిక‌ల‌కు ముందు నుంచే మోహ‌న్‌బాబుకు, మ‌రో స్టార్ హీరోకు మ‌ధ్య ప్ర‌తిసారి ప్ర‌త్య‌క్షంగానో లేదా ప‌రోక్షంగానో మాట‌ల యుద్ధం న‌డుస్తూనే ఉంది. ఇక ఇటీవ‌ల ఏపీలో టిక్కెట్ల ఇష్యూ అంశంపై కొంద‌రు సినిమా హీరోలు, ద‌ర్శ‌కులు ఏపీ సీఎం జ‌గ‌న్‌తో భేటీ అవ్వ‌డం.. ఆ త‌ర్వాత ఏపీ మంత్రి పేర్ని నాని మోహ‌న్‌బాబుతో ఆయ‌న ఇంట్లోనే మీట్ అవ్వ‌డం.. ఆ త‌ర్వాత జ‌గ‌న్‌ను మంచు విష్ణు క‌ల‌వ‌డం లాంటి ప‌రిణామాల‌తో సినిమా రాజ‌కీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో మోహ‌న్‌బాబును టార్గెట్‌గా చేసుకుని పెద్ద ఎత్తున ట్రోలింగ్ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే మోహ‌న్‌బాబు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఇండ‌స్ట్రీని షేక్ చేస్తున్నాయి. త‌న‌ను ట్రోల్ చేస్తోన్న వారు ఎవ‌రో త‌న‌కు తెలుసు అని.. వారిని ప్ర‌కృతి గ‌మ‌నిస్తోంద‌ని.. ఇప్పుడు బాగానే ఉన్నా.. వారు ఏదో ఒక రోజు శిక్ష అనుభ‌వించ‌క త‌ప్ప‌ద‌ని.. అప్పుడు వాళ్ల వెన‌క ఎవ్వ‌రూ ఉండ‌రు.. ఎవ్వ‌రూ సాయం చేయ‌ర‌ని మోహ‌న్‌బాబు అన్నారు.

మోహ‌న్‌బాబు త‌న‌ను ఇద్ద‌రు హీరోలు టార్గెట్ చేస్తున్నార‌ని చెప్పినా.. ఆ హీరోల పేర్లు చెప్ప‌లేదు. అయితే మోహ‌న్‌బాబు చెప్పిన మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే ఆయ‌న చెప్పిన ఆ ఇద్ద‌రిలో ఇండ‌స్ట్రీకి పెద్ద‌దిక్కుగా ఉంటోన్న ఓ స్టార్ హీరోతో పాటు మ‌రో హీరోను ఉద్దేశించే ఆ వ్యాఖ్య‌లు చేశార‌ని అంటున్నారు. ఈ విష‌యం ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా న‌డుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news