యువరత్న నందమూరి బాలకృష్ణ – మలినేని గోపీచంద్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ సిరిసిల్లలో రెండు రోజుల క్రితం ప్రారంభమైన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శృతీహాసన్ కథానాయికగా నటిస్తుండగా… వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో కనిపిస్తోంది. దునియా విజయ్ విలన్‌గా నటిస్తుండగా.. థమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఇటు అఖండ తర్వాత గర్జన మోగిస్తోన్న బాలయ్య… అటు క్రాక్‌తో సూపర్ ట్రాక్‌లో ఉన్న మలినేని గోపీచంద్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా కన్నడ హిట్ సినిమా (శివరాజ్‌కుమార్ హీరో) మఫ్టీకి రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాలో థ్రెడ్ మెయిన్ లైన్‌గా తీసుకుని.. దీనికి మలినేని మార్క్ యాక్షన్ సీన్లు జోడించి తెరకెక్కిస్తున్నారట. తాజాగా లీక్ అయిన బాలయ్య లుక్ కూడా మాసివ్‌గా, రఫ్‌గా ఉంది. వచ్చే దసరాకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడట. అఖండలోనూ బాలయ్య రెండు పాత్రల్లో కనిపించారు. ఈ రెండు పాత్రల్లో ఒకటి ఫ్యాక్షన్ లీడర్‌గా కనిపిస్తే.. రెండో పాత్ర పవర్ ఫుల్ పోలీస్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. గతంలో వినాయక్ దర్శకత్వంలో వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమాలో కూడా బాలయ్య ఇలాగే పోలీస్గాను, ఫ్యాక్షన్ లీడర్‌గా కనిపించాడు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే తరహా పాత్రల్లో కనిపిస్తుండడం విశేషమే.
మలినేని సినిమాలు అన్ని కూడా మాస్‌ను టార్గెట్‌గా చేసుకునే ఉంటాయి. ఇక యాక్షన్ సీన్లకు కొదవ ఉండదు. ఇప్పుడు మలినేని మార్క్ యాక్షన్ సీన్లలో బాలయ్య విజృంభిస్తే వెండితెర విజృంభణే అని చెప్పాలి. ఈ సినిమాకు వీరసింహారెడ్డి అన్న టైటిల్ పరిశీలనలో ఉందన్న ప్రచారం జరుగుతోంది.