ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్ల మధ్య ప్రేమలు, పెళ్లిళ్లు కామన్. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ హీరోయిన్, హీరో పీకల్లోతు ప్రేమలో ఉండడంతో పాటు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న ప్రచారం కోలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది. కోలీవుడ్ యంగ్ హీరో గౌతమ్ కార్తీక్, మళయాళ బ్యూటీ మాంజిమ మోహన్ ఇప్పుడు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారట. వీరిద్దరు కలిసి 2019లో వచ్చిన దేవరత్తమ్ సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే వీరు ప్రేమలో పడినట్టు టాక్ ?
ఒకప్పుడు తెలుగు, తమిళంలో హ్యాండ్సమ్ హీరోగా ఓ వెలుగు వెలిగిన సీనియర్ హీరో కార్తీక్ మీకు గుర్తుండే ఉంటుంది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడల్ సినిమాతో గౌతమ్ హీరోగా తమిళ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో గౌతమ్ సరసన సీనియర్ హీరోయిన్ రాధ రెండో కుమార్తె తులసి ( పెద్ద కుమార్తే రంగం ఫేం కార్తీక) హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఆ సినిమా అనుకున్నట్టుగా సక్సెస్ కాలేదు. ఈ సినిమాను తెలుగులో కడలి పేరుతో రిలీజ్ చేసినా ఇక్కడ కూడా ప్లాప్ అయ్యింది.
అయితే ఈ సినిమాలో గౌతమ్ పాత్ర మాత్రం గౌతమ్‌కు బెస్ట్ డెబ్యూగా నిలిచింది. ఇక మంజిమ మోమన్ మళయాళ అమ్మాయి. అక్కడ బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆమె తెలుగులో కూడా నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో హీరోయిన్గా చేసింది. మంజిమ క్యూట్లుక్స్, నటన యూత్‌ను బాగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో చైతు – మంజిమ జోడీ చాలా ముద్దుగా ఉంది. సాంగ్స్‌లో చాలా రొమాంటిక్‌గా కనిపించారు. సాహసం సినిమా తర్వాత ఆమె మళ్లీ తెలుగులో ఏ సినిమా చేయలేదు.
ఇక ఆమె ప్రస్తుతం గౌతమ్ కార్తీక్‌తో ప్రేమలో ఉందని.. వీరిద్దరు కూడా త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారన్న వార్తలు కోలీవుడ్‌లో బాగా గుప్పుమంటున్నాయి. ఈ వేలంటైన్స్ డే రోజు వీరి ప్రేమ గురించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా ఉంటుందని కోలీవుడ్‌లో ప్రచారం నడుస్తోంది. ఈ జంట పెళ్లి పీటలు ఎక్కితే మొత్తానికి మరో హీరో, హీరోయిన్ లైఫ్ జర్నీ స్టార్ట్ అయినట్టే..!