టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – ఆయన భార్య అయిన మాజీ మిస్ ఇండియా నమ్రతల జోడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా రొమాంటిక్ కపుల్‌గా వీరు ఉంటారు. అసలు వీరి ప్రేమ ఎలా చిగురించింది ? ఇది పెళ్లిగా ఎలా మారింది… వీరి పెళ్లి అయ్యాక ఈ 17 ఏళ్ల మజిలీలో ఏం జరిగిందో తెలుసుకుందాం. యువరాజు సినిమా తర్వాత మహేష్‌బాబు మూడో సినిమాగా తమ సొంత బ్యానర్లో ఓ సినిమా ప్లాన్ చేశారు మహేష్ తండ్రి కృష్ణ.
పద్మాలయ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు సీనియర్ దర్శకుడు బి.గోపాల్ దర్శకుడు అనుకున్నారు. సినిమాలో మహేష్‌బాబుతో పాటు కృష్ణకు కూడా ఓ పాత్ర ఉండేలా చూసుకున్నారు. భారీ బడ్జెట్. హీరోయిన్ ఎవరు అనుకుంటోన్న టైంలో మాజీ మిస్ ఇండియా కావడంతో పాటు అప్పటికే బాలీవుడ్‌లో క్రేజ్ ఉన్ర నమ్రతా శిరోద్కర్‌ను తీసుకోవాలనుకున్నారు. ఆమె వయస్సులో మహేష్ కంటే పెద్దదే. ఆ మాటకు వస్తే మహేష్‌బాబు పక్కన తొలి రెండు సినిమాల్లో చేసిన ప్రితిజింతా, సాక్షి శివానంద్, సిమ్రాన్ కూడా వయస్సులో మహేష్‌కంటే పెద్దవారే.
సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక వీరి మధ్య అంత పరిచయం లేదు. అయితే ఆస్ట్రేలియాలో 40 రోజుల పాటు సుధీర్ఘమైన షెడ్యూల్ దర్శకుడు గోపాల్ ప్లాన్ చేశారు. అక్కడే కొన్ని పాటలతో పాటు ప్రేమ సన్నివేశాలు షూట్ చేశారు. ఆ టైంలో చిగురించిన ప్రేమ చాలా బలంగా పెనవేసుకుపోయింది. అయితే షూటింగ్ టైంలో వీరి ప్రేమవిషయం బయటకు రాకుండా చూసుకున్నారు. 2000లో వంశీ రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది. అప్పటి నుంచి ఐదేళ్ల పాటు మహేష్ – నమ్రత ప్రేమ గురించి బయటకు పెద్దగా విషయాలు పొక్కలేదు.
అయితే వీరి పెళ్లి కృష్ణకు ఇష్టంలేకపోవడంతోనే ముంబైలో కాస్త సీక్రెట్‌గా 2005లో జరిగింది. అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోయారు. పెళ్లికి ముందు మహేష్ వీలున్నప్పుడల్లా సీక్రెట్‌గా ముంబై వెళ్లి నమ్రతను కలిసి వస్తున్నారన్న సందేహాలు ముంబై మీడియా ద్వారా బయటకు వచ్చాయి. అయితే ఇది పెళ్లి వరకు వెళుతుందా ? ఇన్నోసెంట్ అయిన మహేష్ ప్రేమలో పడతాడా ? అన్న సందేహాలు చాలా మందికి ఉన్నాయి. పైగా వయస్సులో తన కంటే పెద్ద అయిన నమ్రతను పెళ్లి చేసుకుంటాడని ఎవ్వరూ అనుకోలేదు.
ఇక పెళ్లి అయ్యాక సినిమాలకు గుడ్ బై చెప్పేసిన నమ్రత తన కెరీర్ పక్కన పెట్టేసి మహేష్ కెరీర్‌ను చక్కదిద్దుతోంది. మహేష్ సినిమాల ప్లానింగ్ నుంచి ఒక పక్కా గృహిణిగా నమ్రత వ్యవహరిస్తున్నారు. పిల్లలు పెద్దవ్వడంతో నమ్రత మహేష్ వ్యాపారాలు కూడా చూసుకుంటున్నారు. ఒకప్పుడు ప్లాపులు ఎదుర్కొన్న మహేష్ ఇప్పుడు వరుస హిట్లతో దూసుకుపోవడం వెనక కథలు, దర్శకుల ఎంపికలో నమ్రత ఇన్వాల్‌మెంట్ కూడా ఉందని అంటారు.
నమ్రత చాలా చారిటీ కార్యక్రమాలను మహేష్ బాబు పేరుతో నిర్వహిస్తున్నారు. తమ పిల్లాడు గౌతమ్ ఏడు నెలల వయస్సులో పుట్టేశారు. తమకు డబ్బు ఉంది.. డబ్బులు లేని చిన్నారుల తల్లిదండ్రులు బాధపడకూడదని మహేష్ బాబు వేలాది చిన్నారుల గుండెలకు జీవం పోశారు. ఆ పనిలో కీలక పాత్ర నమ్రతదే. ఇక వీరి పెళ్లయ్యి 17 ఏళ్లు అయిన సందర్భంగా ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా ఈ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగులైవ్స్.కామ్ తరపున కూడా మహేష్ – నమత్ర దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.