కౌశల్ మందా..ఒక్కప్పుడు ఈ పేరు చేసిన అర్చ్చ అంతా ఇంతా కాదు. కౌశల్ అంటే ఓ మోడల్ గా..కొన్ని సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు..మరి కొన్ని సినిమాల్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు చేశాడు. ఇలానే తెలుసు అందరికి. కానీ తెలుగులోనే అతి పెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యాక ఆయన పేరు మారు మ్రోగిపోయింది. ఎంతలా అంటే ఆయనకు ఓటు వేయ్యండి అంటూ ఇతర దేశాల్లో ఉండే వారు కూడా కౌశల్ ను ప్రమోట్ చేసారు.
అంత క్రేజ్ సంపాదించుకున్నారు. ఒక స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ ఒక బిగ్ బాస్ అనే రియాలిటీ షో ద్వారా సంపాదించి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న కౌశల్ . అంతే కాదు ఏకంగా కౌశల్ ఆర్మీ పేరుతో ఒక అభిమాన సంగమ కూడా ఆయనకు ఏర్పడడమే కాకుండా ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో ఎవరికీ రానన్ని ఓట్లు ప్రతి రోజు రావడం కేవలం కౌశల్ కి మాత్రమే సాధ్యం అయ్యింది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా కౌశల్ చేసిన ఒంటరిపోరాటం అందరిని ఇంప్రెస్ చేసింది. అందుకే ఆయన హౌజ్ లో ఉండగా బయట అతనికి ఓ ఆర్మీ తయారైంది. హౌజ్ లో అతనికి నెగటివ్ మార్కులు పడిన ఫైనల్ గా కౌశల్ ఆర్మీ పుణ్యమాని టైటిల్ విన్నర్ అయ్యాడు కౌశల్ ఆర్మీ.
అయితే హౌస్ లో తోటి కంటెస్టెంట్ యూట్యూబర్ దీప్తి సునైనతో ఆయనకు చాలా గొడవలు అయ్యాయి. కౌశల్ బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా.. దీప్తితో అస్సలు పడేది కాదు. హౌస్‌లో ఉండగా.. కౌశల్‌ని టార్గెట్ చేస్తూ దీప్తి కొన్ని హేళన కామెంట్స్ చేసింది. అంతేకాకుండా.. మిగతా కంటెస్టేంట్లతో కౌశల్ రెండో వారంలోనే ఎలిమినేట్ అవుతాడని..జోస్యం కూడా చెప్పిందట. కానీ ఫైనల్ గా సీన్ రీవర్స్ అయ్యింది.. కౌశల్ టైటిల్మ్ గెలిచాడు ..అమ్మడు 10వ వారంలోనే తట్ట బుట్ట సర్దేసింది.
అయితే చాలా ఏళ్ల తరువాత దీప్తి అన్నమాటల్ని గుర్తు చేసుకున్న కౌశల్ ఆమెపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. “నా అనుభవం అంత వయసు కూడా లేని దీప్తి సునైనా నేను రెండు వారాల్లో వెళ్లిపోతానని చెప్పడంతో కౌశల్ అంటే ఏంటో నిరూపించాలనుకున్నా. కష్టపడి టైటిల్ గెలిచా”… అంటూ కౌశల్ దీప్తి పట్ల తన అసహనం వెళ్లగక్కారు. అంతేకాదు తన గెలుపుకు కారణమైన వారందరికి మరోసారి కృతజ్ఞతలు తెలిపాడు. అయితే టైటిల్ విన్నర్ అయ్యాక కౌశల్ కు ఊహించినంట ఆఫర్లు అయితే రాలేదు. ఇక వచ్చిన అరా కొరా సినిమాలని కౌశల్ నే రిజెక్ట్ చేశాడు..కొన్ని కధ నచ్చక..కొన్ని పారితోషకం నచ్చక..వదులుకున్నాడట.