పాపం వంటలక్క.. జనాలు ఛీ కొట్టేస్తున్నారు. ఆమెకు నీరాజనాలు పట్టిన జనాలే ఇప్పుడు చీచీ పోవమ్మా ? అంటూ చీ కొట్టేస్తున్నారు. కొంత కాలంగా దిగజారుతూ వస్తోన్న కార్తీకదీపం రేటింగ్ ఇప్పుడు మరింత ఢమాల్ అయిపోయింది. ఈ సీరియల్ సాగదీస్తూ ఉండడంతో రేటింగ్ రోజు రోజుకు శరవేగంగా పతనమవుతోంది. ఇప్పుడు మరింత దిగజారింది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల రేటింగ్‌లనే తలదన్నేసింది. కథా నాయిక ప్రేమి విశ్వనాథ్‌ను చూసేందుకే జనాలు ఎగబడిపోయేవారు. కట్ చేస్తే ఇప్పుడు ఈ సోది సీరియల్ ఏంట్రా బాబు అని తలలు పట్టుకుంటున్నారు.
ఒక్కసారి లాస్ట్ వీకెండ్ రేటింగ్‌లు చూస్తే
దేవత – 12.84 టీఆర్పీ
ఇంటింటి గృహలక్ష్మీ – 12.55
గుప్పెడంత మనసు – 12.37
కార్తీకదీపం – 10.01
జానకీకలగన లేదు – 9.88
పైన చెప్పినవీ అన్నీ మా టీవీ సీరియల్స్ రేటింగ్. ఒకప్పుడు ఏకచక్రాధిపత్యంతో తన రేటింగ్ దరిదాపుల్లోకి కూడా ఏ సీరియల్‌ను రాని కార్తీకదీపం ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది. రేపో మాపో ఇది మరింత దిగజారే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ శరవేగంగా తన రేటింగ్ పెంచుకుంటోంది. కార్తీకదీపంను మిగతా సీరియల్స్ అన్నీ తొక్కేస్తున్నాయి.
సీరియల్ సాగదీత ప్రేక్షకులకు చిరాకు తెప్పించేస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్ బార్క్ కేటగిరిలో 16, 17, 18 రేటింగ్‌లకు వెళ్లి అందరూ కుళ్లుకునేలా చేసిన ఈ సీరియల్ ఇప్పుడు వంటలక్క పాత్ర బోర్ కొట్టేస్తోంది. ఇప్పుడు కాస్తో కూస్తో సీరియల్‌కు క్రేజ్ ఉందంటే అది మోనిత పాత్రతో మాత్రమే. ఇప్పటకీ అయినా ఈ సీరియల్‌కు మంచి ముగింపు ఇవ్వకుండా సాగదీస్తుంటే ఈ సీరియల్‌కు ఉన్న పేరు కూడా పోయే ప్రమాదం ఉంది.