పూజా హెగ్డే ప్రస్తుతం సౌత్ ఇండియాలో తిరుగులేని స్టార్ హీరోయిన్. వరుస హిట్లతో దూసుకుపోతోంది. పూజకు పట్టిందల్లా బంగారం అవుతోంది. పూజ ఇప్పటికే ఎన్టీఆర్, మహేష్, రామ్‌చరణ్, బన్నీ లాంటి హీరోలతో నటించేసింది. ఈ స్టార్ హీరోలు ఇప్పుడు మరోసారి పూజాను తమ సినిమాల్లో రిపీట్ కూడా చేస్తున్నారు. అటు కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పూజ దూసుకుపోతోంది. ఇటు ప్రభాస్‌తో ఆమె చేసిన పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ కూడా వచ్చే నెల 11న రిలీజ్ అవుతోంది.
ప్రస్తుతం పూజా చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ చూస్తే మరో యేడాదికి పైగా ఆమె ఖాళీ లేనట్టే..! ఆమె చేసిన సినిమాలు అన్ని హిట్ అవుతుండడంతో ఇప్పుడు ఆమె ఒక్కో సినిమాకే ఏకంగా రు 3-4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఇక ముంబైలో కోట్ల రూపాయలతో ఆమె ఓ భారీ భవంతి కూడా నిర్మించుకుంటోంది. పూజకు సమంతకు గత మూడు, నాలుగేళ్లుగా కోల్డ్‌వార్ ఉంది. సోషల్ మీడియాలో పూజ అభిమానులు, సమంత అభిమానుల మధ్య స్టార్ట్ అయిన గొడవ ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్ల ఇగోలు క్లాష్ అయ్యేవరకు వెళ్లింది.
తర్వాత వీరిద్దరు ఎవరి దారుల్లో వారు పని చేసుకుంటున్నా ఆ గ్యాప్ అలాగే ఉందన్నది అర్థమవుతోంది.
పూజ తెలుగులో సమంత మాజీ భర్త నాగచైతన్య ఒక లైలా కోసం సినిమాతోనే హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత మెగా హీరో వరుణ్‌తేజ్ పక్కన ముకుంద సినిమా చేసింది. తాజాగా పూజ నటించిన ఆచార్య, రాధేశ్యామ్ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ సినిమా కూడా చేస్తోంది. కోలీవుడ్‌లో విజయ్ పక్కన మరో సినిమా చేస్తోంది.
ఇక ఇప్పుడు తన తొలి తెలుగు హీరో నాగచైతన్యతో కూడా ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ ? ఇప్పుడు పూజ పెద్ద హీరోల పక్కన నటించేందుకే డేట్లు ఖాళీ లేదు. మరి చైతన్యకు ఎందుకు ఓకే చెప్పింది అంటే సమంతపై ఉన్న కోపంతోనే అన్న చర్చలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో రొమాంటిక్ సస్పెన్స్ సినిమాలో ఆమె చైతుకు జోడీ కట్టనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందట. అటు చైతు కోసం, ఇటు సమంతపై ఉన్న కోపంతోనే ఆమె ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందని అంటున్నారు.