ప్రేమికుల దినోత్సవం అంటే ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకునే దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేమికులకు ఈ రోజు ఓ స్పెషల్. ఇక సెలబ్రిటీలు ప్రేమికుల రోజును ఎంతో ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. వారి ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమికుల దినోత్సవం రోజున తన ప్రేయసి లేదా ప్రియుడికి తమ ప్రేమను ఎలా ఎక్స్‌పోజ్ చేశారన్నది వారు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు.
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలిసిందే. అల్లు అర్జున్ ఈ రోజు పాన్ ఇండియా హీరోల్లో ఒకటిగా దూసుకుపోతున్నాడు. బన్నీ సినిమా వస్తుందంటే చాలు అంచనాలు పాన్ ఇండియా రేంజ్‌లోనే ఉంటున్నాయి. బన్నీ స్నేహారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అసలు వీరిద్దరి ప్రేమ ఎలా ? చిగురించింది ? ఆ ఆసక్తికర సంగతులు ఏంటో ఓసారి చూద్దాం.
పెళ్లికి ముందు బన్నీకి యూత్‌లో మాంచి క్రేజ్ ఉంది. హైదరాబాద్‌లో ఎక్కువుగా ఫ్రెండ్స్‌తో కలిసి వీకెండ్ పార్టీలకు వెళుతూ ఉండేవాడు. అలా ఓ పార్టీలో స్నేహని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. స్నేహ మాత్రం చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందట. బన్నీ ప్రేమను ఒప్పుకుంటుందా ? లేదా ? అన్న సందేహం బన్నీకి ఉండేదట. చివరికి ఎలాగోలా స్నేహను ఒప్పించి బన్నీ తన ప్రేమలో సక్సెస్ అయ్యాడు.
ఇక ఇటు తన ఇంట్లో తన ప్రేమను ఒప్పించుకునేందుకు బన్నీ ముందుగా తాను ఎంతో ఇష్టపడే తన అమ్మకే ఈ విషయం చెప్పాడట. ఆమె అల్లు అరవింద్‌కు చెప్పి ఒప్పించింది. ఇక స్నేహ తండ్రి నల్లగొండ జిల్లాకు చెందిన వారు. ఇబ్రహీంపట్నంలో ఆయనకు విద్యాసంస్థలు ఉన్నాయి. పెళ్లికి ముందు స్నేహా ఆ విద్యాసంస్థల చైర్మన్‌గా ఉండేవారు. ఆయన 2014లో టీఆర్ఎస్ నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
బన్నీ – స్నేహపెళ్లికి ముందు ఫోన్లు, మెసేజ్‌లతో పాటు ఒకరిని ఒకరు ఇంప్రెస్ చేసేందుకు బహమతులు కూడా ఇచ్చిపుచ్చుకునేవారట. పెళ్లి తర్వాత వీరి ప్రేమకు ప్రతి రూపంగా అయాన్, అర్హ రూపంలో ఇద్దరు పిల్లలను గాడ్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇక పదో పెళ్లి రోజును బన్నీ భార్య స్నేహ తాజ్‌మహాల్ వద్ద సెలబ్రేట్ చేసిందట. మోకాళ్ల మీద కూర్చొని ప్రపోజ్ చేసి.. రొమాంటిక్ వెకేషన్‌కు తీసుకువెళ్లా.. అదే నేను బన్నీకి ఇచ్చిన అతి పెద్ద గిఫ్ట్ అని స్నేహ ఓ సందర్భంలో చెప్పింది.