యువరత్న నందమూరి బాలకృష్ణ. దివంగత విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు చేత తన నట వారసుడిగా పలికించుకున్నాడు. నాలుగు దశాబ్దాలుగా బాలయ్య తెలుగు సినిమా రంగంలో కొనసాగుతున్నాడు. ఈ మధ్యలో ఎందరో హీరోలు వచ్చారు.. వెళుతున్నారు. బాలయ్య క్రేజ్ ఎప్పుడూ అలాగే ఉంటూ వస్తోంది. మధ్యలో చాలా సార్లు బాలయ్య సినిమాలు ప్లాప్ అయ్యాయి. డిజాస్టర్లు అయ్యాయి. అలాగే సూపర్ హిట్లు కూడా వచ్చాయి. ఎన్ని సార్లు కింద పడినా అంతే స్పీడ్‌తో పైకి లేవడం బాలయ్యకు మాత్రమే సొంతం.
బాలయ్యది ముక్కుసూటి మనస్తత్వం.. ఆయన ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొడుతూ ఉంటారు. మనసులో ఏదీ దాచుకోరు. మనసులో ఒకటి పెట్టుకుని.. పైకి ఇంకోటి మాట్లాడే మనస్తత్వం ఆయనది కాదు. ఆయన ఏం చేసినా ప్రచారం కోరుకునే మనిషి కాదు. ఈ రోజుల్లో పావలా సాయం చేసి పది రూపాయలు ప్రచారం చేసుకునే వాళ్లు, స్టార్ హీరోలే కనిపిస్తున్నారు. బాలయ్య వ్యక్తిగత సాయాలతో పాటు బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతోమందికి ప్రాణాలు పోస్తున్నా ఏనాడు ఆయన బయట చెప్పుకోరు.
మధ్యలో ఆయన్ను కొందరు సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. నెటిజన్లు ట్రోల్ చేశారు. అయినా బాలయ్య తన బాటలోనే ముందుకు వెళ్లారు. ఇక గత 40 ఏళ్లలో బాలయ్యకు ఎంత క్రేజ్ ఉందో.. 60 + వయస్సులో అది కూడా గత రెండేళ్లలో బాలయ్య క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ రెండేళ్లలో బాలయ్యపై సోషల్ మీడియాలో, నెటిజన్ల చర్చల్లో కూడా పాజిటివిటీ బాగా పెరిగిపోయింది.
ఎవ్వరూ నెగిటివ్ కామెంట్లు చేయడం లేదు. పార్టీలు, ఇతర హీరోల అభిమానులు కూడా జై బాలయ్యా నినాదం ఎంచుకుంటున్నారు. ఇక అఖండ తర్వాత ఎక్కడ చూసినా బాలయ్య పేరు మరింతగా మార్మోగిపోతోంది. అఖండ ఎన్నో సంక్లిష్ట పరిస్థితుల్లో వచ్చి హిట్ టాక్‌తో ఏకంగా బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఇప్పటి వరకు బాలయ్య కెరీర్‌లో రు. 100 కోట్ల సినిమా లేదు. అలాంటిది అఖండ ఏకంగా రు. 200 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఇది మామూలు సంచలనం కాదు.
ఇక అల్లు అరవింద్ ఆహా ఓటీటీ లో వచ్చిన Unstoppable program ప్రోగ్రామ్ కూడా బాలయ్య రేంజ్‌ను మరో లెవల్‌కు తీసుకు వెళ్లడంలో చాలా హెల్ఫ్ అయ్యింది. బాలయ్యకు చాలా సామాజిక వర్గాల్లో ఊహించని క్రేజ్, అభిమానం రావడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇక బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఆయన చేస్తోన్న సేవలు ఇటీవల కాలంలో మరింతగా పెరిగాయి. ఈ ఆసుపత్రి కోసమే ఆయన ఇటీవల తెలంగాణ మంత్రి హరీష్‌రావును కూడా కలిశారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ వేవ్లో మహామహులు ఓడిపోయినా కూడా హిందూపురంలో బాలయ్య 2014 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని మించిన మెజార్టీతో గెలిచారు. ఇక అవినీతి అన్న పదం బాలయ్య ఏనాడు దరిచేరనీయలేదు. అసలు ఇప్పుడు రాజకీయాల్లో ఆ మరక అంటని వారిలో బాలయ్యే నెంబర్ వన్. ఇలా ఈ కారణాలు అన్నీ బాలయ్య ఇమేజ్‌ను ఈ రెండేళ్లలో స్కై రేంజ్‌కు తీసుకువెళ్లి పోయాయి.