టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. గత మూడేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ.. పలుసార్లు వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి దిగుతుందా ? అని కోట్లాది మంది సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. వాస్తవంగా సంక్రాంతి కానుకగా జనవరి 7న 14 భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అందుకు అనుగుణంగానే పాన్ ఇండియా రేంజ్‌లో భారీ ఎత్తున ప్రమోషన్లు చేశారు. ఈ సినిమా ప్రమోషన్ల కోసమే ఏకంగా రు. 20 కోట్లు బడ్జెట్ కేటాయించారు.
సినిమా రిలీజ్ అవుతోందనుకుంటోన్న టైంలో ఒమిక్రాన్ కేసులు పెరగడంతో పాటు ఏపీలో టిక్కెట్ రేట్లు తగ్గించేయడం.. ఏపీలో సినిమా రిలీజ్‌కు సానుకూల వాతావరణం లేకపోవడంతో మరోసారి ఈ సినిమాను వాయిదా వేశారు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ డేట్ వచ్చేయడంతో అభిమానుల్లో మామూలు జోష్ లేదు. రాజమౌళికి అసలు అపయజం అన్నదే లేదు. రాజమౌళి కెరీర్‌లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి ఇప్పటి వరకు అన్నీ సూపర్ హిట్లే.. ఈ లెక్కన త్రిబుల్ ఆర్ విషయంలో కూడా ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు లేవు.
అయితే ఈ సినిమా హిట్‌కు ఓ సెంటిమెంట్‌కు లింక్ పెడుతున్నారు చెర్రీ, ఎన్టీఆర్ అభిమానులు. ఎన్టీఆర్ హీరోగా వివి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమా 2002 మార్చి 28న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే తిరుగులేని బ్లాక్‌బస్టర్ అవ్వడంతో పాటు ఏకంగా 98 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇక రామ్‌చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ రంగస్థలం కూడా మార్చి నెలలోనే రిలీజ్ అయ్యింది.
ఇప్పుడు వీరిద్దరు కలిసి నటిస్తోన్న త్రిబుల్ ఆర్ మార్చి 25న వస్తుండడంతో ఖచ్చితంగా ఈ సినిమా కూడా ఆ రెండు సినిమాలను మించి సూపర్ హిట్ అవుతుందని తారక్, చరణ్ అభిమానులు అప్పుడే సంబరాలు చేసుకుంటున్నారు. ఇక తారక్ తన నెక్ట్స్ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తుండగా… రామ్‌చరణ్ తన తండ్రితో కలిసి చేస్తోన్న ఆచార్యతో పాటు ఇటు శంకర్ దర్శకత్వంలో వస్తోన్న తన 15వ ప్రాజెక్టును కూడా చేస్తున్నాడు.