టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ కెరీర్లో ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. గతేడాది కరోనా టైంలో వచ్చిన క్రాక్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రవితేజ కెరీర్ కష్టాల్లో ఉన్నప్పుడు మాంచి జోష్ ఇచ్చింది. ఈ సినిమా హిట్ అయ్యాక రవితేజకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. అటు దర్శకుడు మలినేని గోపీచంద్ ఏకంగా అఖండ తర్వాత నటసింహం బాలయ్యను డైరెక్ట్ చేయబోతున్నాడు.
ఇక రవితేజ తాజా సినిమా ఖిలాడి. రమేష్‌వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా రు. 60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా ఇప్పుడున్న పరిస్థితుల్లో రిలీజ్‌కు ముందు టేబుల్ ప్రాపిట్ సొంతం చేసుకున్న ఏకైక సినిమా ఖిలాడి. ఈ నెల 11న ఖిలాడి థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాలో రవితేజ సరసన మినాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమాలో రవితేజ తన గత సినిమాలకు భిన్నంగా రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నట్టు చెపుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లు కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ డింపుల్ హయతీ మాట్లాడుతూ ఆసక్తకిర విషయాలు చెప్పింది.
ఆమె ఫొటో చూసిన ఎవరో ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శకుడు రమేష్‌వర్మకు పంపారట. రవితేజ ఆమె ఫొటో చూసిన వెంటనే ఆమె గద్దలకొండ గణేష్‌లో సాంగ్ చేసిందని చెప్పారట. రవితేజతో ఈక్వల్ పాత్ర అనగానే ముందు చేసేందుకు చాలా భయం వేసిందని.. ఒకానొక టైంలో తనను సినిమా నుంచి తీసేస్తారేమో అనుకున్నానని కూడా చెప్పింది.
ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని చెప్పిన డింపుల్.. ఈ సినిమాలో కేచ్ మీ సాంగ్ చేసేందుకు ఆరు కేజీలు తగ్గమని దర్శకుడు సూచించారట. ఆ సాంగ్ కోసమే తాను ఎంతో కష్టపడి ఆరు కేజీల బరువు తగ్గానని చెప్పింది.