మెగాస్టార్ చిరంజీవి.. నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో స్టార్ హీరోగా ఎదిగిన టాలీవుడ్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవిది ప్రత్యేక స్థానమని చెప్పొచ్చు. పునాదిరాళ్లు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అంచెలంచెలుగా ఎదిగిన చిరంజీవి ఈ వయస్సులోనూ నెంబర్‌వన్‌గానే ఉన్నారు. పదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నా ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి కూడా తన సత్తా తగ్గలేదని ఫ్రూవ్ చేసుకున్నారు. ఇప్పటికి అదే గ్రస్ తో స్టెప్పులు వేస్తూ యంగ్ హీరోలకి ధీటుగా సినిమాలు చేస్తూ..అందరిని ఆశ్చర్యానికి గురిచెస్తున్నారు. ప్రస్తుతం చిరు చేతి నిండా సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా బిజీ బిజీ గా గడిపేస్తున్నారు.
కాగా, చిరు ఇన్నేళ్ల తన కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు. ఈయన పక్కన నటించిన హీరోయిన్లందరు కూడా మంచి విజయాని అందుకుని లైఫ్ లో బాగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ కూతుర్లను కూడా ఇండస్ట్రీలోకి దింపుతున్నారు. అలనాటి నటి మేనక అదే హీరోయిన్ కీర్తీ సురేష్ తల్లితో మొదలు పెట్టి అలా మాధవి, రాధిక, రాధ, ఆ తర్వాత తరంలో విజయశాంతి, రమ్యకృష్ణ, రంభ, రోజా, ఆ తర్వాత వచ్చిన సాక్షి శివానంద్, సిమ్రాన్ నుంచి ఇప్పటి తరంలో కాజల్, నయనతార, తమన్నా వరకు ఇలా మూడు తరాల హీరోయిన్ల పక్కన నటించారు.
కానీ ఎప్పుడు కూడా ఏ హీరోయిన్ తో మిస్ బీహేవ్ చేసిన్నట్లు కానీ చిరు వల్ల వాళ్లి ఇబ్బందులు పడిన్నట్లు కానీ జరగలేదు. ఇంకా హీరోయిన్లే ఆయన కోసం కొట్టుకున్నారట. కొట్టుకోవడం అంటే జుట్లు పట్టుకుని కొట్టుకోవడం కాదండోయ్..సరదాగా ఫ్రెండ్లీ ఫైట్ .
ఇక ఇంద్ర సినిమా షూటింగ్ టైంలో అచ్చం ఇలాగే చిరు కోసం పోట్లాడుకున్నారట ఆర్తి అగర్వాల్-సొనాలి బింద్రే. హీరోగా చేసిన ఫ్యాక్షన్ మూవీ ‘ఇంద్ర’ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికి ఈ సినిమా గురించి చర్చించుకుంటారనడంలో అతిశయోక్తి లేదు. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2002లో జూలై 24న విడుదలై టాలీవుడ్ బాక్స్ ఆఫిస్ చరిత్రను తిరగ రాసింది. అప్పట్లోనే ఈ మూవీ రాష్ట్రంలోనే అత్యధిక సెంటర్ లలో విడుదలై 100 రోజులకు పైగా ఆడి రికార్డుల మోత మోగించింది. అలా ఫ్యాక్షన్ మూవీ ఇంద్ర ఓ ట్రెండ్ సెట్ చేసింది. అంతటి ఘన విజయం సాధించిన ఈ మూవీలో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రె కథానాయికలుగా నటించారు.
ఈ సినిమా క్లైమాక్స్ సీన్ గుర్తింది కదా..లాస్ట్ లో చిరంజీ కోసం ఆర్తి అగర్వాల్-సోనాలి ..ఇంద్రసేనా రెడ్డి నాకు కావలి అంటే నాకు కావాలి అంటూ..సొనాలి ఇంద్రని కాశీ తీసుకుపోవాలని అంటుంటే..ఆర్తి అగర్వాల్ ఇంద్ర కట్టకుండా పడేసిన తాళిని తీసుకొచ్చి కట్టమంటూ బలవంతం చేస్తుంది. ఆ టైంలో అది మనకి ఫన్నీ గానే అనిపించిన డైరెక్టర్ కు మాత్రం చాలా కష్టం అయ్యిందట.
లాస్ట్ కి చిరు పక్కన ఏ హీరోయిన్ ని భార్య చూయించాలి అనుకుంటున్న టైంలో ఇద్దరు ముద్దుగుమ్మలు ..ఇంద్ర ని నాతో వచ్చేటట్లే క్లైమాక్స్ రాసుకోండి అంటూ సొనాలి చెప్తుంటే..నో మొదట ఇంద్ర లైఫ్ లీకి వచ్చింది నేను ..నన్నే ఆయన భార్య గా జనాలకి చూయించండి అంటూ ఆర్తి అనడంతో కొంచెం సేపు వీళ్ళ మధ్య ఫన్నీ ఫైట్ నడిచిందట. ఇక లాస్ట్లో ఇంద్రసేనా రెడ్డిని ప్రజల మనిషిగా..ప్రజలకోసం బ్రతికే మనిషిగా చూయిస్తారు డైరెక్టర్.