సిద్ధు జొన్నలగడ్డ – నేహాశెట్టి జంటగా వచ్చిన సినిమా డీజే టిల్లు. నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తొలి ఆటకే సూపర్ హిట్‌టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తొలి రోజుకే బ్రేక్ ఈవెన్‌కు వచ్చేసి రెండో రోజు నుంచే లాభాల్లోకి వచ్చేసింది. లాంగ్రన్ ముగిసే సరికి ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని.. ప్రతి ఒక్కరికి భారీ లాభాలు ఖాయమని ఇండస్ట్రీ, ట్రేడ్ వర్గాలు లెక్కుల వేస్తున్నాయి.
ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను యూనిట్ బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇక సినిమాలో సిద్ధుతో పాటు హీరోయిన్ నేహాశెట్టికి కూడా మంచి మార్కులు పడ్డాయి. నేహాశెట్టికి మంచి పేరు వచ్చింది. ఈ సంతోషంలో ఉన్న ఓ విషాద వార్తను చెప్పింది. ఈ సినిమా రిలీజ్‌కు రెండు రోజుల ముందు నేహా శెట్టి నానమ్మ మృతి చెందింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన నేహా శెట్టి ఉద్వేగానికి లోనైంది.
ఓ ఎమోషనల్ నోట్ కూడా ఆమె షేర్ చేసింది. నా అభిమాని, చీర్ లీడర్ నన్ను వదిలి వెళ్లిపోయింది. నాకు రెండు సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుంచే నా పెర్పామెన్స్ చూసేందుకు ఆమె ఎప్పుడూ ముందు వరుసలో ఉండేది. ఇక ఆమె లేరన్న వార్తతో నా హృదయం ముక్కలవుతోంది. అయినా ఆమె ప్రేమ, ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయి.. ఐ లవ్ యూ అవ్వా.. డీజే టిల్లు విజయం నీకు అంకితం ఇస్తున్నా అంటూ రాసుకువచ్చింది. అలాగే చిన్నప్పుడు అవ్వతో దిగిన ఫొటోలు కూడా షేర్ చేసింది.
View this post on Instagram