ప్రముఖ గాయకుడు.. స్వరకర్త బప్పీలహరి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. బప్పలహరి అంటే బాలీవుడ్‌లో రెండు, మూడు దశాబ్దాల క్రితం ఓ క్రేజ్.. యువతో ఓ ఐకాన్. హిందీలో ఎన్నో బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన బప్పీలహరి ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి .. ఇక్కడ కూడా సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడు. గతేడాది కోవిడ్ తర్వాత ఆయన ఆరోగ్యం దెబ్బతింది. ఈ క్రమంలోనే పలు అనారోగ్య సమస్యలతో ఆయన ముంబైలోని జుహూలోని క్రిటికేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు.
ఆయన ముద్దు పేరు బప్పి డా..! ఆయన ఆ టైంలోనే ఒక్కో సినిమాకు బాలీవుడ్ మొత్తం మీద ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్‌గా రికార్డులకు ఎక్కారు. ఆయనకు బంగారం అంటే విపరీతమైన వ్యామోహం. బప్పిలహరి డీస్కో డ్యాన్సర్ కూడా..! హ్మత్‌వాలా – షరాబి – అడ్వెంచర్స్ ఆఫ్ టార్జాన్ – డ్యాన్స్ డ్యాన్స్ – సత్యమేవ జయతే – కమెండో సినిమాలకు ఆయన మ్యూజిక్ ఇచ్చారు.
తెలుగులో ఆ రోజుల్లో సూపర్‌స్టార్ కృష్ణ తన సింహాసనం సినిమా కోసం బప్పిలహరిని రంగంలోకి దించారు. ఆ సినిమా విజయంలో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో బప్పీలహరి పనితనం ప్రశంసించాల్సిందే. ఆ తర్వాత తెలుగులో చిరంజీవి, బాలయ్య, మోహన్‌బాబు లాంటి స్టార్ హీరోలకు అదిరిపోయే ఆల్బమ్‌లు బప్పిలహరి ఇచ్చారు. ఆయన చివరిగా 2020లో బాఘీ 3 కోసం భంకస్ పాటను కంపోజ్ చేశాడు.
ఇక స్టార్ హీరోయిన్లు స్టార్ హీరోలకు, దర్శకులకో మాత్రమే పడిపోతారన్న అపోహ ఉంటుంది. అయితే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా ఇటీవల హీరోయిన్లు పడిపోతున్నారు. ఉదాహరణకు టాలీవుడ్‌లో ఓ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌కు ఓ హీరోయిన్‌తో ఎఫైర్ ఉందన్న ప్రచారం జరిగింది. కోలీవుడ్‌లో మరో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌కు పలువురు హీరోయిన్లతో ఎఫైర్ ఉందన్న ప్రచారం నాలుగైదేళ్లుగా ఉంది.
అయితే ఆ రోజుల్లోనే బప్పీలహరి టాలీవుడ్‌కే చెందిన ఓ టాప్ హీరోయిన్‌తో ఎఫైర్ కొనసాగించారని.. సదరు హీరోయిన్ అంటే బప్పీలహరి ప్రాణం ఇచ్చేసేవాడన్న రూమర్లు ఉన్నాయి. సదరు హీరోయిన్ కూడా బప్పీలహరి అంటే పడిచచ్చేంతగా ఉండేదట. సదరు హీరోయిన్ తెలుగు సినిమాను ఓ ఊపు ఊపేసి.. తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అవ్వడంతో పాటు ఓ వెలుగు కూడా వెలిగింది. ఆ హీరోయిన్ ప్రేమలో పడ్డాకే బప్పీలహరి కెరీర్‌లో కాస్త వెనకపడ్డారని కూడా అంటారు.