సింహాద్రి తర్వాత రాజమౌళికి వరుస పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేయాలన్న ఆఫర్లు ఎక్కువుగా వచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్‌తో ఛత్రపతి, రవితేజతో విక్రమార్కుడు, ఎన్టీఆర్‌తో యమదొంగ ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. యమదొంగ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని రామ్‌చరణ్‌తో మగధీర చేశాడు. 2006లో చిరుత సినిమాతో హీరోగా పరిచయం అయిన రామ్‌చరణ్ రెండో సినిమా కోసం ఏకంగా మూడేళ్ల పాటు లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి. నిర్మాత అల్లు అరవింద్.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఓడిపోయి ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన ఈ సినిమాను మెగా అభిమానులు, ప్రజారాజ్యం అభిమానులు కలిసికట్టుగా చూసి తిరుగులేని బ్లాక్‌బస్టర్ చేయడంతో పాటు మెగా ఫ్యామిలీ అంటే ఏంటో ఇండస్ట్రీకే కాదు.. యావత్ తెలుగు ప్రజలకు చూపించారు. అసలు మగధీర రికార్డుల్లో ఇప్పటకీ కొన్ని చెక్కు చెదర్లేదు. అయితే ఈ సినిమా క్రెడిట్ విషయంలో దర్శకుడు రాజమౌళికి, నిర్మాత అల్లు అరవింద్‌కు మధ్య కొంత గ్యాప్ నడిచిందన్న ప్రచారం ఇండస్ట్రీలో ఉంది.
సినిమా రిలీజ్ అయ్యాక అల్లు అరవింద్ క్రమక్రమంగా రాజమౌళిని సైడ్ చేసేసుకుంటూ వచ్చారనే అంటారు. అయితే ఇక్కడ అరవింద్ – రాజమౌళి మధ్య గ్యాప్‌నకు మరో కారణం కూడా ఉంది. అప్పట్లో 50 రోజులు, 100 రోజులు, 175 రోజుల సెంటర్ల విషయంలో ఎక్కువుగా ఫేక్ రికార్డులు చూపించేవారు. అభిమానుల మధ్య పోటీ నేపథ్యంలో వారిని సంతృప్తి పరిచేందుకు ఈ రికార్డులు తప్పని సరి అయ్యేవి. మగధీర విషయంలో అలా జరగకూడదనే సినిమా రిలీజ్ అయ్యాక 50, 100 రోజుల సెంటర్ల విషయంలో ఫేక్ రికార్డులు లాంటివి చేయవద్దని.. అసలు వాటిని వెల్లడించవద్దని ముందే అరవింద్‌కు చెప్పాడట. అందుకే అరవింద్ కూడా ఓకే చెప్పేశాడు.
తీరా రిలీజ్ అయ్యాక సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో అసలు అరవింద్ రాజమౌళిని కొన్ని విషయాలో పక్కన పెట్టేయడంతో పాటు 50 – 100- 175 రోజుల సెంటర్ల ప్రచారం కూడా చేసేశారట. ఇదే విషయమై రాజమౌళి అరవింద్‌ను అడిగితే ఫ్యాన్స్ ఒత్తిడితోనే తాను అలా చేయాల్సి వచ్చిందని.. అయినా ఇలాంటివి మామూలే అని చెప్పారట. దీంతో రాజమౌళి హర్ట్ అయ్యారు. ఇక ఈ సినిమాను తెలుగులో రిలీజ్ అయిన నెల రోజులకే తమిళంలో కూడా రిలీజ్ చేయమని ఎంతో ఒత్తిడి చేసినా అరవింద్ తెలుగు ప్రమోషన్లలో పడి ఆ విషయం పట్టించుకోలేదు. ఈ రెండు కారణాలతో రాజమౌళి హర్ట్ అవ్వడంతో పాటు.. అరవింద్‌తో ఆయనకు గ్యాప్ పెంచాయని అంటారు.