కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన సినిమాలలో బాలయ్య అఖండ, బన్నీ పుష్ప సినిమాలు రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు నిజంగానే ఇండస్ట్రీ జనాలకు, ఇటు ప్రేక్షకులకు కొండంత ధైర్యం ఇచ్చాయి. సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎంత ఇబ్బంది ఉన్నా, కరోనా ఉన్నా కూడా సినిమా చూసేందుకు థియేటర్లకు వస్తారని ఈ రెండు సినిమాలే ఫ్రూవ్ చేశాయి.
డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప, అఖండ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథమే పట్టేశారు. ఇక ఈ రెండు సినిమాలు 50 రోజులు పూర్తి చేసుకున్నాయి. అఖండ తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు విపరీతమైన లాభాలు తెచ్చిపెడితే.. పుష్ప హిందీ డిస్ట్రీబ్యూటర్లకు భారీ లాభాల మూట అందించింది. ఈ రెండు సినిమాలు మాస్‌కు బాగా ఎక్కడంతో బాలయ్య, బన్నీ అభిమానులతో పాటు మాస్ జనాలు కూడా విపరీతంగా ఎంజాయ్ చేశారు.
అయితే 50 రోజుల కేంద్రాల విషయంలో బన్నీ, బాలయ్య రికార్డుకు చాలా దూరంలో ఆగిపోయాడు. బాలయ్య అఖండ ఇక్కడే 103 కేంద్రాల్లో 50 రోజులు ఆడగా.. వరల్డ్‌వైడ్‌గా చూస్తే మొత్తం 106 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. పుష్ప కేవలం 24 కేంద్రాల్లోనే 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా రిలీజ్ అయిన మూడువారాలకే ఓటీటీలోకి వచ్చేయడంతో ఆ ఎఫెక్ట్ 50 రోజుల కేంద్రాలపై పడినట్టు తెలుస్తోంది. ఓటీటీలోకి వచ్చాక పుష్పను ఎక్కువ మంది థియేటర్లలో చూసేందుకు ఇష్టపడలేదు.
అయితే పుష్పకు బాలీవుడ్‌లోనే రు. 100 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఓవరాల్‌గా పుష్ప గ్రాస్ రు. 365 కోట్లుగా ఉంటే.. అఖండ వసూళ్లు రు. 200 కోట్లు దాటాయి. ఇక అఖండ సినిమా హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉండగా.. పుష్ప అమెజాన్ ఫ్రైమ్‌లో అందుబాటులో ఉంది. ఈ రెండు సినిమాలు ఇటు డిజిటల్ మీడియాలోనూ టాప్ వ్యూస్‌తో దూసుకు పోతున్నాయి.