పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో వచ్చిన మల్టీస్టారర్ మూవీ భీమ్లానాయక్. మల్లూవుడ్‌లో హిట్ అయిన అయ్యప్పనుం కోషియమ్ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగులో భీమ్లానాయక్‌గా తెరకెక్కింది. సితార ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలు అందుకుందో ? లేదో ప్రీమియర్ షో టాక్‌లో చూద్దాం.
ఫస్టాఫ్ అంతా భీమ్లానాయక్‌ను డీసెంట్‌గా నడిపించారు. కొన్ని చోట్ల సినిమా స్లో అయినట్టు కనిపించినా.. పవన్ వర్సెస్ రానా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైన తీరు.. ఒకరికొకరు సవాల్ చేసుకోవడం, థమన్ సంగీతం బాగున్నాయి. త్రివిక్రమ్ డైలాగులు సూపర్బ్. ఇక ప్రీ ఇంటర్వెల్ సీన్‌తోనే సినిమా పైసా వసూల్ అన్నది తేలిపోయింది. గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చుకున్న ఇద్దరి వ్యక్తుల కథే ఈ సినిమా.
ఓ పోలీస్ ఆఫీసర్‌కు, ఓ మాజీ మంత్రి, మాజీ ఎంపీ కొడుకు మధ్య అహంకారం, ఆత్మాభిమానంతో యుద్ధం జరిగితే ఎలా ? ఉంటుందో అన్న అంశాలతో ఈ కథను తెరకెక్కించారు. మనం రెగ్యులర్‌గా చూసే హీరో వర్సెస్ విలన్ మధ్య వార్ కోణంలో ఈ సినిమా తెరకెక్కలేదు. ఇద్దరు పవర్ ఫుల్ క్యారెక్టర్ల మధ్య వార్ నడుస్తుంటే ఎలా ఉంటుందో ? అన్న పవర్ ఫుల్ లైన్‌తో సినిమా తెరకెక్కించారు. అయితే సినిమా ఫస్టాఫ్‌లో ఒక్కో క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేస్తూ పోయే క్రమంలో సినిమా రిథమ్‌లోకి రావడానికి కాస్త టైం పట్టింది. రిథమ్లోకి వచ్చినప్పటి నుంచి మాత్రం ఉరుకులు పరుగులు పెట్టేస్తుంది.
సెకండాఫ్ మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను కన్నారప్పకుండా చేశాయి. సెకండాఫ్‌లో ప్రతి 10 నిమిషాలకు ఓ మాస్ ఎలిమెంటో, యాక్షనో వస్తూనే ఉంటుంది. అయితే ఎంచుకున్న లైన్ ప్లాట్ యాంగిలలో ఉండడంతో మనకు కమర్షియల్ సినిమాల్లో బాగా దట్టించే ఎమోషనల్ ఎలిమెంట్స్ మనం ఇక్కడ మిస్ అయినట్టుగా ఉంటుంది. ఫస్టాఫ్‌లో నేపథ్య సంగీతం విషయంలో సోసోగా కానిచ్చేసిన థమన్ సెకండాఫ్ స్టార్ట్ అయిన 15 నిమిషాల నుంచి ఎండింగ్ వరకు తన నేపథ్య సంగీతంతో ఊపేశాడు.
ఇక సినిమాలో ఎన్ని పాత్రలు ఉన్నా ప్రధానంగా సినిమా అంతా పవన్ – రానా చుట్టూనే నడుస్తుంది. ఇక బ్రహ్మానందం కూడా చిన్న రోల్ చేశాడు. ఇక విజువల్స్ పరంగా సూపర్. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఇక త్రివిక్రమ్ పంచ్‌లు బాగా పేలాయి. త్రివిక్రమ్ ఎఫర్ట్ ఈ సినిమాకు చాలా యూజ్ అయ్యింది. ఓవరాల్‌గా భీమ్లానాయక్ ప్రీమియర్లతో పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీ స్టార్ట్ చేసింది.