తెలుగు సినిమా పరిశ్రమ అంటేనే బంధుత్వాలతో నిండిపోయింది. ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు తరాల నుంచి చాలా మంది ఒకే ఫ్యామిలీ వాళ్లు తిష్టవేసి ఉన్నారు. ఒకటో తరం నుంచి రెండో తరం.. ఇప్పుడు మూడో తరంలోనూ అదే ఫ్యామిలీ హీరోలు స్టార్స్‌గా కంటిన్యూ అవుతున్నారు. ఇక హీరోలుగా, దర్శకులు, నిర్మాతలుగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఇక్కడ బంధువులు అవుతారు. నందమూరి వంశంలో దివంగత విశ్వవిఖ్యాత నటుడు అయిన నందమూరి తారక రామారావు తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని స్టార్ హీరోగా చెలామణి అవుతున్నాడు.
బాలయ్యకు ఇన్నేళ్లలో ఎంతో మంది సన్నిహితులతో పాటు బంధువులు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. బాలయ్య తోడళ్లుడు సైతం పెద్ద నిర్మాతే. అయితే ఆ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. బాలయ్య తోడళ్లుడు ఎంఆర్‌వి. ప్రసాద్. ప్రసాద్ బాలయ్య భార్య వసుంధర సోదరి భర్త. స్వతహాగా పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన ప్రసాద్ అమెరికాలోని అలబామా వర్సిటీలో ఎంబీచేచ పూర్తి చేశారు.
ప్రసాద్‌కు మొదట్లో సినిమాలు అన్నా.. సినిమా రంగం అన్నా పెద్ద ఆసక్తి ఉండేది కాదు. బాలయ్యతో సన్నిహితంగా ఉండడం స్టార్ట్ చేశాక ప్రసాద్ సినిమాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. ఈ క్రమంలోనే తాను నటించే సినిమాల నిర్మాణ వ్యవహారాలు చూడమని బాలయ్య చెప్పారు. 1980ల్లో బాలయ్య నటించిన కొన్ని సూపర్ హిట్ సినిమాల నిర్మాణ వ్యవహారాల్లోనూ ఆయన పాలు పంచుకున్నారు.
ఆ తర్వాత బాలయ్య – ప్రసాద్ కలిసి ప్రియదర్శిని – బ్రాహ్మణి ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి బాలగోపాలుడు సినిమా నిర్మించారు. ఈ సినిమాతోనే కళ్యాణ్‌రామ్ బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా హిట్ అయ్యాక ప్రసాద్ నిర్మాతగా నిలదొక్కుకున్నారు. ఆ వెంటనే బాలయ్యతో కొన్ని సినిమాలు నిర్మించారు. 1999లో సుల్తాన్, హిట్ అయ్యింది. ఆ తర్వాత ఓ చిన్న సినిమా ప్లాప్ కావడంతో ఆయన కొద్ది రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు.
మళ్లీ 2006లో వచ్చిన అల్లరి పిడుగు సినిమా ఆయనే నిర్మించారు. ఈ సినిమా యావరేజ్ అయినా కూడా ఆయనకు లాభాలు వచ్చాయి. ఆ తర్వాత ప్రసాద్ సినిమా నిర్మాణాలకు దూరమై.. బాలయ్య సినిమాలకు ప్రొడక్షన్ కార్యక్రమాలు చూసుకుంటూ వచ్చారు. ఇక 2019లో బాలయ్య మొదటి సారి నిర్మాత గా నిర్మించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహనాయకుడు సినిమాలకు ప్రసాదే నిర్మాణ వ్యవహారాలు చూసుకున్నారు.