Moviesకాస్టింగ్ కౌచ్ బాంబు వేసిన మ‌రో హీరోయిన్‌...

కాస్టింగ్ కౌచ్ బాంబు వేసిన మ‌రో హీరోయిన్‌…

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అన్న‌ది ఇప్పుడు అన్ని భాష‌ల్లో కామ‌న్ అయిపోయింది. ఏ ముహూర్తాన ఈ కాస్టింగ్ కౌచ్ అన్న ప‌దం పాపుల‌ర్ అయ్యిందో కాని.. అప్ప‌టి నుంచి చాలా మంది హీరోయిన్లు, చిన్నా చిత‌కా న‌టీమ‌ణులు కూడా ధైర్యంగా తాము త‌మ జీవితంలో ఎదుర్కొన్న లైంగీక వేధింపులు, అనుభ‌వాల గురించి చెప్పేస్తున్నారు. బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ అయితే ఈ కాస్టింగ్ కౌచ్‌పై చాలాసార్లు ధైర్యంగా మాట్లాడింది. తాను ఎదుర్కొన్న లైంగీక వేధింపులు మాత్ర‌మే కాకుండా.. ఇండ‌స్ట్రీలో ఆ త‌ర‌హా వేధింపులు ఎదుర్కొన్న వారి త‌ర‌పున ధైర్యంగా పోరాటం చేయ‌డంతో పాటు స్టార్ హీరోలు, ద‌ర్శ‌కుల‌ను కూడా గ‌ట్టిగానే టార్గెట్ చేస్తూ త‌న వాయిస్ వినిపించింది.

ఇక సౌత్‌లో పాపుల‌ర్ సింగ‌ర్‌, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి శ్రీపాద కూడా త‌న లైంగీక వేధింపులు బ‌య‌ట పెట్ట‌డంతో పాటు చాలా మంది బాధితుల‌కు అండ‌గా ఉంటున్నారు. ఆమె ఏకంగా స్టార్ రైట‌ర్ వైరిముత్తు లాంటి వాళ్ల‌ను కూడా టార్గెట్ చేసి సంచ‌ల‌నం అయ్యారు. తాజాగా మ‌రో హీరోయిన్ తాను ఎదుర్కొన్న లైంగీక వేధింపుల గురించి ఓపెన్ అయ్యింది. సినిమా రంగంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినా, స్టార్ హీరోయిన్ అయినా కూడా కెరీర్ స్టార్టింగ్‌లో లైంగీకంగా రాజీప‌డ‌క త‌ప్ప‌ద‌ని శ్రీరెడ్డి లాంటి వాళ్లు ఎన్నోసార్లు చెప్పారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే నా ప్రేమ నాకు కావాలి – ఇండిపెండెంట్‌ సినిమాలో నటించింది స్నేహా శర్మ. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో త‌న‌కు ఎదురైన వేధింపులు, అనుభ‌వాల‌ను ఏక‌రువు పెట్టేసింది. కాస్టింగ్ కౌచ్‌ను ఇండ‌స్ట్రీలో తాను కూడా ఎదుర్కొన్నాన‌ని చెప్పిన స్నేహ అవ‌కాశం అడిగితే చాలు.. వెంట‌నే క‌మిట్‌మెంట్ అడిగేసేవార‌ని.. నో అన్నందుకే త‌న‌ను వెంట‌నే ఆ సినిమాల్లో నుంచి తీసేశార‌ని ఆమె వాపోయింది.

అలా తాను కమిట్‌మెంట్‌కు నో చెప్ప‌డంతోనే కొన్ని పెద్ద సినిమాల్లో అవ‌కాశాలు కోల్పోయాన‌ని చెప్పింది. అవ‌స‌రం అయితే తాను అడుక్కుని తిని అయినా బ‌తుకుతానే కానీ ఇలాంటి ప‌నులు చేయ‌న‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది. సినిమా ఇండ‌స్ట్రీలో అవ‌కాశాల కోసం క‌మిట్‌మెంట్లు, కాస్టింగ్ కౌచ్‌లు కామ‌న్ అని.. అయితే అవి మ‌న‌మీదే ఆధార‌ప‌డి ఉంటాయ‌ని చెప్పింది. ప్ర‌స్తుతం స్నేహా శ‌ర్మ కామెంట్లు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news