తెలుగు సినిమా ఇండస్ట్రీలో గీత ఆర్ట్స్ బ్యానర్‌ది 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రస్థానం. లెజెండ్రీ కమెడియన్ అల్లు రామలింగయ్య వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాపించారు. 40 సంవత్సరాల చరిత్రలో గీత ఆర్ట్స్ బ్యానర్ నుంచి ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి సినిమా కెరీర్లో నుంచి ఎన్నో మరపురాని సినిమాలు తెరకెక్కాయి. చిరంజీవి కెరీర్ ఈ స్థాయిలో ఉండటానికి గీతా బ్యానర్ కూడా ఒకటి. ఆ తర్వాత తరం హీరోల్లోనూ ఈ బ్యానర్లో అల్లు అర్జున్ – రామ్ చరణ్ లాంటి హీరోలు కూడా నటించారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్ అంటే మెగా ఫ్యామిలీ బ్యానర్ అన్న అంచనాలను అల్లు అరవింద్ పటాపంచలు చేస్తున్నారు. ఆయన స్థాపించిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫాంలో ఎవరూ ఊహించని విధంగా యువరత్న నందమూరి బాలకృష్ణతో అన్‌స్టాపబుల్ వితన్ ఎన్బీకే టాక్ షో చేయించారు. ఈ టాక్ షో తెలుగు బుల్లితెర పైన ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయింది. ఆహా సబ్స్క్రిప్షన్స్ ఈ టాక్ షో వల్లే లక్షల్లో పెరిగిపోయారు. ఇప్పుడు తెలుగులో ఆహా పేరు మారుమోగుతుంది. బాలయ్యకు కూడా ఈ టాక్ షో చాలా కలిసివచ్చింది. పైగా నందమూరి బంధాన్ని పెనవేసుకుని చేసింది
ఇక బాలయ్యతో తమ ఫ్యామిలీకి ఉన్న బుల్లితెర బంధాన్ని వెండితెరపై కూడా కంటిన్యూ చేసేందుకు అల్లు అరవింద్ ప్రణాళికలు రచిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బాలయ్య హీరోగా ఓ సినిమా నిర్మించేందుకు అరవింద్ రెడీ అవుతున్నారు. ఇందుకు సంబంధించి ఓ డైరెక్టర్‌కు అరవింద్ అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌తో బింబిసారుడు సినిమా డైరెక్ట్ చేస్తున్న మల్లిడి వశిష్ట్ అనే డైరెక్టర్ దర్శకత్వంలోనే బాలయ్య హీరోగా అరవింద్ సినిమా ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే వశిష్ట్‌కు అరవింద్ అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. సమాజంలో అవినీతి, అక్రమాలపై పోరాటం చేసే ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఏదేమైనా అల్లు అరవింద్ తన బ్యానర్లో బాలయ్యతో సినిమా నిర్మించడం ద్వారా మరో సంచలనాలకు కేంద్ర బిందువు కానున్నారు. ఇక అల్లు – నందమూరి ఫ్యామిలీ బంధం కూడా మరింత బలపడనుంది.