స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. పుష్ప బాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి రు. 100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇది మామూలు సంచలనం కాదు. బన్నీకి ఇప్పటికే టాలీవుడ్‌తో పాటు మల్లూవుడ్‌లోనూ తిరుగులేని క్రేజ్ ఉంది. ఇప్పుడు దీనికి తోడు బాలీవుడ్‌లో కూడా క్రేజ్ రావడంతో బన్నీ నేషనల్ స్టార్ అయిపోయాడు. అయితే అనుకోకుండా ఇటీవల బన్నీ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. పుష్ప సినిమాలో బన్నీ చేసిన పుష్పరాజ్ పాత్ర స్మగ్లర్ పాత్ర కావడంతో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇంకా బన్నీ పుష్ప పాత్రను ఎవరో ఒకరు.. ఏదో రూపంలో విమర్శిస్తూనే వస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న నటులను సహజంగానే తమ బ్రాండ్లకు అంబాసిడర్లుగా నియమించుకుంటారు. కంపెనీలు గత కొన్నేళ్ల నుంచి ఈ సంప్రదాయాలు పాటిస్తూనే వస్తున్నాయి. ఇక క్రేజ్ ఉన్న హీరోలు, హీరోయిన్లు కూడా దీనిని ఎంచక్కా క్యాష్ చేసుకుంటున్నారు. ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ తనకంటూ సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకోవడంతో పాటు ఎన్నో బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.
ఈ క్రమంలోనే పుష్ప సినిమా రిలీజ్‌కు ముందు ఓ బ్రాండ్ ప్రకటనలో కనిపించి వివాదాల్లో చిక్కుకున్నాడు. బన్నీ రాపిడో బైక్‌ను పొగుడుతూ ఆర్టీసీని కాస్త తక్కువ చేస్తూ చూపించిన యాడ్‌లో నటించి వివాదంలో చిక్కుకున్నాడు. ప్రముఖ ఫుడ్ సంస్థ జొమాటోకు బన్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా
ఉండగా.. ఈ యాడ్‌లో బన్నీ సుబ్బరాజుతో ఫైట్ చేస్తూ కొడితే సుబ్బరాజు గాల్లో తేలతాడు. వెంటనే సుబ్బరాజు నన్ను కిందకు దించు గోంగూర మటన్ తినాలి.. హోటల్ మూసేస్తారు అంటాడు.
అప్పుడు బన్నీ ఇది సౌత్ సినిమా కదా గాల్లో ఎక్కువ సేపు ఎగరాలి.. ఎప్పుడు ఏం కావాలన్నా జొమాటో ఉంది… సూపర్ ఫాస్ట్ మనసు కోరితే తగ్గేదేలే అని చెపుతాడు. ఈ యాడ్‌పై బన్నీ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తుంటే… కొందరు మాత్రం విమర్శిస్తున్నారు. సహజంగానే సౌత్ అంటే నార్త్ వాళ్లకు చిన్నచూపు ఉంటుంది. అసలు తమిళం వాళ్లకు అలాంటి చూపే ఉండేది.
బాహుబలి, శ్రీమంతుడు సినిమాల నుంచి వాళ్ల నోళ్లకు తాళాలు పడ్డాయి. ఇప్పుడు బాహుబలి, సాహో, పుష్ప తర్వాత నార్త్ వాళ్లు కూడా సౌత్ వాళ్లను చూసి భయపడుతున్నారు. ఇలాంటి టైంలో మన సౌత్ హీరో అయిన బన్నీ సౌత్ సినిమా ఇమేజ్ పెంచేలా చేయకుండా… సౌత్ ఇండస్ట్రీని చిన్నబుచ్చే విధంగా
యాడ్‌లో ఎలా కామెంట్ చేస్తాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.