MoviesRRR రాజ‌మౌళి పంతంతో నిర్మాత‌కు అన్ని కోట్లు న‌ష్ట‌మా...!

RRR రాజ‌మౌళి పంతంతో నిర్మాత‌కు అన్ని కోట్లు న‌ష్ట‌మా…!

రాజమౌళి సినిమా ప‌ర్‌ఫెక్ష‌న్ విష‌యంలో ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటాడో తెలిసిందే. తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా వ‌చ్చేవ‌ర‌కు ఎక్క‌డా రాజీప‌డ‌డు. త‌న క్వాలిటీకి త‌గిన క‌లెక్ష‌న్లు కూడా ఉండాల‌ని ఆశిస్తాడు. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి మార్కెట్ ఇప్పుడు పాన్ ఇండియా పరిధి కూడా దాటేసింది. రాజమౌళి సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా కనీసం పది భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి బ్రాండ్ మీద ఇప్పుడు ఆయ‌న సినిమా మార్కెట్ అవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా తెరకెక్కిన త్రిబుల్ ఆర్‌ సినిమా సైతం ఇప్పుడు 14 భాష‌ల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

ఇప్ప‌టికే యేడాది కాలంగా ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌స్తోంది. నిర్మాత దాన‌య్య రు. 450 కోట్ల భారీ బ‌డ్జెట్ కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన‌ప్పుడు యేడాదిలో రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇప్పుడు మూడేళ్లు అవుతోంది. వ‌డ్డీలు కూడా క‌లుపుకుంటే.. చాలా ఎక్కువ అయిపోయింది. దాన‌య్య కూడా పైకి చెప్ప‌లేక‌పోతున్నా లోప‌ల మాత్రం చాలా ఇబ్బంది ప‌డుతున్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

ప్రి రిలీజ్‌కు ముందు దాన‌య్య‌కు బీపీ వ‌చ్చింద‌ట‌. అయితే వ‌ర‌ల్డ్‌వైడ్‌గా డిజిట‌ల్‌, శాటిలైట్ రైట్స్ బిజినెస్ జ‌రిగాక దాన‌య్య కాస్త ఊపిరి పీల్చుకున్నార‌ట‌. ఇక గ‌త నెల రోజులుగా బెంగ‌ళూరు, చెన్నై, ముంబైల‌లో భారీ ఎత్తున ప్రి రిలీజ్ ఈవెంట్లు చేస్తున్నారు. ఈ ప్ర‌మోష‌న్ల‌కే రు. 20 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు పెట్టార‌ట‌. ఇక ఓవ‌ర్సీస్‌లో ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్‌లు, థియేటర్ల బుకింగ్‌ల‌కు మ‌రో రు. 5 కోట్లు ఖ‌ర్చు చేశార‌ట‌. అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తే తాను అనుకున్న రేంజ్లో వ‌సూళ్లు రావ‌నే రాజ‌మౌళియే ఎక్కువుగా ప్రెజ‌ర్ చేసి సినిమా వాయిదా ప‌డేలా చేశార‌ట‌.

ఈ ఖ‌ర్చులు అన్ని ఇప్పుడు సినిమా వాయిదాతో బూడిద‌లో పోసిన ప‌న్నీరు అయ్యాయి. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం మ‌రికొన్ని సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈ సారి మాత్రం ఎవ్వ‌రూ త‌ప్పుకునేలా లేరు. ఏదేమైనా రాజ‌మౌళి తీసుకున్న ఈ నిర్ణ‌యంతో నిర్మాత‌కు ఓ రు. 25 కోట్ల న‌ష్టం వ‌స్తే… మిగిలిన సినిమాలకు కూడా భారీగా న‌ష్టం వాటిల్లింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news