యంగ్‌టైగర్ ఎన్టీఆర్ త్రిఫుల్ ఆర్ సినిమా వాయిదా పడడంతో ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతున్నాడు. ఒమిక్రాన్ వైరస్ హడావిడి లేకపోతే ఈ పాటికే కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కేసే ఉండేది. ఇక సంక్రాంతి తర్వాత కరోనా హడావిడి ఎప్పుడు తగ్గి.. తిరిగి సినిమా షూటింగ్‌లు ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడే ఎన్టీఆర్ – కొరటాల సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ అంటే మంచి అంచనాలు ఉంటాయి. గతంలో వీరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ రిపీట్ కావడం.. అటు త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి, ఆచార్య తర్వాత కొరటాల నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి.
జనతా గ్యారేజ్ సినిమాలో ఓ కీలక పాత్రలో మళయాళ నటుడు మోహన్‌లాల్ నటించారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ బాబాయ్ రోల్ కీలకం అవుతుందట. ఈ పాత్ర కోసం సీనియర్ నటుడు, యాంగ్రీ యంగ్‌మ్యాన్ రాజశేఖర్ పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రాజశేఖర్ ప్రస్తుతం సోలో హీరోగా బిజీ అవుతున్నాడు. రాజశేఖర్ తాజా సినిమా శేఖర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి టైంలో రాజశేఖర్ ఎన్టీఆర్‌కు బాబాయ్ రోల్ చేస్తే అటు రాజశేఖర్ కెరీర్‌కు ప్లస్ కావడంతో పాటు ఈ సినిమాకు కూడా ప్లస్ అవుతుంది.
ఎన్టీఆర్ బాబాయ్‌గా రాజశేఖర్ నటిస్తున్నాడంటే మరి కాంబినేషన్ అదుర్స్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే 2022 ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్టు డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఈ సినిమా ఆ డేట్‌కు రిలీజ్ అయ్యే పరిస్థితులు లేవు. ఇంకా కొరటాల స్క్రిఫ్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట. ట్రిఫుల్ ఆర్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో కొరటాల ఈ సినిమా ను పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఈ సినిమా కోసమే ఎన్టీఆర్ బరువు తగ్గి సరికొత్త లుక్‌లోకి వచ్చేశాడు. ఈ సినిమా రివేంజ్ బ్యాక్‌డ్రాప్లో తెరకెక్కనుందని ఎన్టీఆర్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఎన్టీఆర్ కూడా త్రిపుల్ ఆర్ తర్వాత తన పాన్ ఇండియా ఇమేజ్‌ను ఈ సినిమాతో మరింత స్ట్రాంగ్ చేసుకోవాలని ఉన్నాడు.