యువరత్న నందమూరి బాలకృష్ణ – యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ హ్యాట్రిక్ అఖండ. రు. 200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా కేవలం థియేట్రికల్ వసూళ్లే రు. 150 కోట్లు. అఖండ హిట్ జోష్‌లో ఉన్న బోయపాటి.. బాలయ్యతోనే అఖండకు సీక్వెల్‌గా అఖండ 2ను కూడా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటన చేశారు. తాజాగా ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇక డిస్నీ + హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా అక్కడ కూడా టాప్ వసూళ్లతో దూసుకుపోతోంది.
ఇక ఈ సినిమాను డబ్బింగ్ చేసి బాలీవుడ్‌లో రిలీజ్ చేయాలని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా క్రేజ్ చూసిన బాలీవుడ్ జనాలు ఈ సినిమాను అక్కడ రీమేక్ చేసేందుకు పోటీ పడుతున్నారు. ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ఇద్దరు బాలీవుడ్ హీరోలు పోటీపడుతున్నట్టు తెలుస్తోంది.
బాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా ఉన్న అక్షయ్‌కుమార్, అజయ్‌దేవగన్ ఇద్దరికి మాస్ ఇమేజ్ ఉంది. వీరు సౌత్‌లో హిట్ అయిన మాస్ సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్ చేసి సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు వీరి కన్ను మాస్ జాతర అయిన అఖండపై పడింది. వారిద్దరు అఖండ రీమేక్‌లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అఖండ బాలీవుడ్ రైట్స్ కోసం ఇప్పుడు మంచి డిమాండ్ నెలకొంది.
వీరిద్దరిలో ఎవరు అఖండను రీమేక్ చేసినా వారికి బాగా సెట్ అవ్వడం ఖాయం. బాలీవుడ్ జనాలు ఇటీవల మాస్ సినిమాలు బాగా ఇష్టపడుతున్నారు. రూరల్ బాలీవుడ్ ప్రేక్షకులకు తెలుగు మాస్ సినిమాలను డబ్ చేసి వదిలినా పిచ్చపిచ్చగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అఖండ అక్కడ కూడా హిట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.