Moviesఇక పై వాళ్లు రష్మిక సినిమాలు చూడరట..కెరీర్ కే బిగ్గెస్ట్ ఎదురుదెబ్బ...

ఇక పై వాళ్లు రష్మిక సినిమాలు చూడరట..కెరీర్ కే బిగ్గెస్ట్ ఎదురుదెబ్బ ఇదే..!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన. అమ్మడు పేరు ప్రస్తుతం ఎలా మారుమ్రోగిపోతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్న ఈ బ్యూటీ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడమే కాదు..వరుస ఆఫర్ లతో కాల్ షీట్లతో పాటు..భారీ స్దాయి లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ తన ఖాతా నింపుకుంటుంది.

నిజానికి ‘ఛలో’ సినిమాలో అమ్మడు పర్ ఫామెన్స్ చూసి అందరు అప్పుడే డిసైడ్ అయిపోయారు..రష్మిక స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరి టాలీవుడ్ ని ఏలేస్తుంది అని. అయితే అనూహ్యంగా రష్మిక టాలీవుడ్ నే కాదు బాలీవుడ్ కోలీవుడ్ లో సైతం అమ్మడు పేరు మారు మ్రోగిపోయేలా చేసుకుంది. రీసెంట్ గానే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా చేసిన అమ్మడు కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. పుష్ప సినిమాలో అమ్మడు నటనకు ఎంత మంచి పేరు వచ్చిందో మనం చూసాం.

అయితే ప్రస్తుతం ఆ పేరుని చెడకొట్టుకునే పనిలో ఉంది రష్మిక అంటున్నారు పలువురు నెటిజన్స్. అమ్మడుకు వరుస హిట్ సినిమాలు పడేసరికి హెడ్ వెయిట్ బాగా పెరిగింది అంటున్నారు పలువురు నెటిజన్స్. టాలీవుడ్ గడపతొక్కి అనతికాలంలోనే క్రేజీ హీరోయిన్‌గా మారిన ఈ కన్నడ భామ రష్మిక మందన నెట్టింట నవ్వుల పాలు అయ్యింది. తాజాగా ఓ సినిమా షూటింగ్​ కోసం ముంబై లోని హోటల్ కి వెళ్లిన రష్మిక బీహెవియర్ పట్ల నెటిజన్స్ మండిపడుతున్నారు. దీంతో ఈ నేషనల్ క్రష్ మళ్లీ ట్రోలింగ్​ బారిన పడింది.

ముంబైలో ఓ హోటల్​ నుంచి బయటకొచ్చిన రష్మికను ఓ చిన్నారి ఆకలిగా ఉందంటూ డబ్బులు అడగడం స్టార్ట్ చేసింది. అయిన పట్టించుకోని రష్మిక సెక్యూరిటీ గార్డుల చేత పాపను పక్కకు తోసిచ్చింది..ఇక అది చాలదు అన్నట్లు ఆ పాప రష్మిక ను డబ్బులు ఇవ్వమని ప్రాధేయపడుతూ ఉంటే..అది చూసి ‘తన వద్ద డబ్బులు లేవు’ అని చెప్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రష్మికను ఓ రేంజ్ లో తిట్టిపోస్తున్నారు. ‘చిన్న పాప అలా నిన్ను అడుక్కుంటుంటే నీకు నవ్వు ఎలా వస్తుంది’ అని విరుచుకుపడుతున్నారు. ‘ఈరోజు నుంచి నీ సినిమాలు చూడం’ అని కామెంట్స్​ పెడుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news