రష్మిక మందన్న ఇప్పుడు పట్టిందల్లా బంగారం అయిపోయింది. ఆమె ఏ భాషలో ఏ హీరోతో సినిమా చేసినా కూడా సూపర్ హిట్ అవుతోంది. ఇప్పటికే సౌత్ ఇండియాలో తిరుగులేని స్టార్డమ్ కంటిన్యూ చేస్తోన్న ఆమె క్రేజ్ ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసింది. ప్రస్తుతం రష్మిక ఒక్కో సినిమాకు రు. 3 కోట్ల పైనే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. చిన్న హీరోల సినిమాలు చేసేందుకు కూడా ఆమె ఇదే రేటు డిమాండ్ చేస్తోంది.
ఫేమ్‌లో ఉండగానే బాలీవుడ్లో కూడా స్థిరపడిపోవాలని రష్మిక తెగ ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాల్లో నటిస్తోంది. అయితే ఇంకా పెద్ద హీరోలు, ప్రతిష్టాత్మక బ్యానర్లలో కూడా సినిమాలు చేయాలని రష్మిక తెగ ట్రై చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్ బ్యానర్లో ఓ బంపర్ ఛాన్స్ వచ్చినట్టు టాక్ ? తాజాగా ఆ సంస్థ కార్యాలయంలో రష్మిక ప్రత్యక్షమైంది.
ఆ సంస్థతో ఆమె ఒప్పందం కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ డీల్‌లో ఆమెతో చాలా క్లోజ్‌గా ఉంటోన్న ఓ టాలీవుడ్ హీరో ఆమెను రికమెండేషన్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బాగా ప్రచారం జరుగుతోంది. రష్మిక – సదరు హీరో చాలా చాలా క్లోజ్‌గా ఉంటున్నారు. ఈ మధ్య వాళ్ల మధ్య స్నేహాన్ని మించిన బాండింగ్ ఉందని టాలీవుడ్లో ఒక్కటే ఠాంఠాం ప్రచారం జరుగుతోంది. సదరు హీరో ఆమెతో జంటగా ఓ డిజాస్టర్, ఓ బ్లాక్‌బస్టర్‌లో కలిసి నటించాడు. ఈ క్రమంలోనే సదరు హీరో రష్మిక పేరును కరణ్ జోహార్‌కు రికమెండ్ చేసి ఆమెకు ఛాన్స్ ఇప్పించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం సదరు హీరో కరణ్ జోహార్‌తో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రష్మిక కోసం బాగా ప్రెజర్ చేసి మరీ ఆమెకు ఆ బ్యానర్లో ఛాన్స్ ఇప్పించాడన్న గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక రష్మిక ప్రస్తుతం తెలుగులో పుష్ప 2తో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తోంది.