నటసౌర్వభౌమ, నటరత్న ఎన్టీఆర్ వారసుడిగా మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తన కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఆ తర్వాత ఆదితో టాలీవుడ్ చిచ్చరపిడుగు అని నిరూపించుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో రెండో సినిమాగా వచ్చిన సింహాద్రి అయితే అప్పుడు తెలుగునాట ఓ ఊపు ఊపేసింది.
సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ చాలా చిన్న వయసులోనే పవర్ఫుల్ ఫ్యాక్షనిస్ట్ గా కనిపించాడు. ఎన్టీఆర్ సరసన భూమిక – అంకిత హీరోయిన్లుగా నటించారు. వీఎంసీ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత వి. దొరస్వామిరాజు ఈ సినిమాను నిర్మించారు. ఆ రోజుల్లోనే 150కి పైగా కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న సింహాద్రి ఏకంగా 55 చోట్ల 175 రోజులు ఆడింది. సింహాద్రి క్రియేట్ చేసిన చాలా రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయి. టెంపర్ కు ముందు ఎన్టీఆర్ వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడ్డాడు.
అయితే టెంపర్ నుంచి తిరిగి ఫామ్ లోకి వచ్చిన మనోడు వరుసపెట్టి హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ సింహాద్రి సినిమా ఓపెనింగ్ కు సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. సింహాద్రి సినిమా ప్రారంభోత్సవానికి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుతో పాటు అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి దేవేందర్ గౌడ్ , దర్శకరత్న దాసరి నారాయణరావు, ఆ సినిమా దర్శకుడు రాజమౌళి కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతుంది.
ఈ ఫొటోలు ఎన్టీఆర్, రాజమౌళి చాలా యంగ్ ఏజ్‌లో ఉన్నారు. ఇక రాజమౌళి కేవలం 21 సంవత్సరాల వయస్సులోనే సింహాద్రి సినిమా చేశాడు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌ను ఒక్కసారిగా టర్న్ చేసేసింది. ఆ తర్వాత మరోసారి అదే రాజమౌళి – ఎన్టీఆర్ కాంబోలో యమదొంగ సినిమా వచ్చింది. ఇక ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా కూడా తెరకెక్కింది.