Moviesటాలీవుడ్‌లో సొంత మ‌ర‌ద‌ళ్ల‌నే పెళ్లాడిన హీరోలు వీళ్లే..!

టాలీవుడ్‌లో సొంత మ‌ర‌ద‌ళ్ల‌నే పెళ్లాడిన హీరోలు వీళ్లే..!

భార‌తీయ సంస్కృతి, సంప్ర‌దాయం ప్ర‌కారం మేన‌మామ కుమార్తెలు, కొడుకులు, అలాగే అత్త కూతుళ్లు, కొడుకుల‌ను పెళ్లాడుతూ ఉంటారు. ద‌గ్గ‌రి బంధుత్వాలు చేసుకుంటూ బంధం బ‌ల‌ప‌డుతుంద‌ని.. చుట్టారికాలు చెక్కు చెద‌ర‌కుండా ఉంటాయ‌ని న‌మ్ముతుంటారు. 1990 వ ద‌శ‌కం వ‌ర‌కు ఈ ద‌గ్గ‌రి బంధుత్వాలు క‌లుపుకునే సంస్కృతి ఎక్కువుగా ఉండేది.

అయితే ఇప్పుడు మ‌ర‌ద‌ళ్ల‌ను, బావ‌ల‌ను పెళ్లి చేసుకోవ‌డం బాగా త‌గ్గిపోయింది. ఇప్పుడు ఎక్కువుగా ప్రేమ వివాహాలే జ‌రుగుతున్నాయి. ఇక మ‌న సినిమా ఇండస్ట్రీలో కొంద‌రు స్టార్ హీరోలు కూడా మ‌ర‌ద‌ళ్ల‌ను పెళ్లాడారు. అలా సొంత మ‌ర‌ద‌ళ్ల‌నే పెళ్లాడిన స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసుకుందాం.

సీనియ‌ర్ ఎన్టీఆర్ :
తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నటుడు ఎన్టీరామారావుకు ఇద్ద‌రు భార్య‌లు. ఆయ‌న పెద్ద భార్య బ‌స‌వ తార‌కం… ఎన్టీఆర్‌కు స్వ‌యానా మ‌ర‌ద‌లు అవుతుంది. 1942లోనే ఎన్టీఆర్ బ‌స‌వ‌తార‌కంను బంధువులు, కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో పెళ్లాడారు. అయితే అప్ప‌ట‌కి ఎన్టీఆర్ ఇంకా సినిమాల్లోకి రాలేదు. ఇక బ‌స‌వ‌తార‌కం కూడా ఎన్టీఆర్‌ను ఇష్ట‌ప‌డ‌డంతో వీరి పెళ్లిని ఇరు వైపుల కుటుంబ స‌భ్యులు ద‌గ్గ‌రుండి జ‌రిపించారు.

ఏఎన్నార్‌:
మరో దివంగ‌త లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు కూడా సొంత మరదలిని పెళ్లి చేసుకున్నారు. నాగేశ్వరరావు అన్నపూర్ణమ్మను 1949 లో పెళ్లాడారు. అయితే అప్ప‌టికే ఎన్టీఆర్ నాట‌కాలు ఆడ‌డంతో పాటు సినిమాల్లోకి వ‌చ్చి ప‌ది సినిమాల్లో కూడా న‌టించారు. అన్న‌పూర్ణ‌మ్మ కూడా నాగేశ్వ‌ర‌రావును బాగా ఇష్ట‌ప‌డేవారు.

 

కృష్ణ :
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కూడా త‌న సొంత మ‌ర‌ద‌లు అయిన ఇందిరాదేవినే పెళ్లి చేసుకున్నాడు. ఈ దంప‌తుల‌కు ఐదుగురు సంతానం. 1961లో వీరి పెళ్లి జ‌రిగింది. ఆ త‌ర్వాత న‌టి, ద‌ర్శ‌కురాలు విజ‌య‌నిర్మ‌ల‌ను ఆయ‌న రెండో పెళ్లి చేసుకున్నారు.

మోహ‌న్‌బాబు :
క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు త‌న మ‌ర‌ద‌లు ( భార్య సోద‌రి)ని పెళ్లాడారు. ఆయ‌న ముందుగా విద్యాదేవిని పెళ్లాడారు. ఈ దంప‌తుల‌కు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న – విష్ణు పుట్టాక ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఆ త‌ర్వాత ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావుతో పాటు బంధువులు ఆ పిల్ల‌ల కోసం విద్యాదేవి చెల్లి నిర్మలాదేవితో మోహ‌న్‌బాబుకు మ‌ళ్లీ పెళ్లి చేశారు. ఈ దంప‌తుల‌కు మ‌నోజ్ జ‌న్మించాడు.

ఆది :
డైలాగ్ కింగ్ సాయికుమార్ కుమారుడు ఆది ఆయన సొంత మరదలిని వివాహం చేసుకున్నాడు. సాయి కుమార్ భార్య తమ్ముడి కూతురే ఆది భార్య‌. వీరి వివాహాన్ని చిన్న‌ప్పుడే పెద్ద‌లు నిర్ణ‌యించ‌డంతో సాయి కుడా వారి మాట జ‌వ‌దాట‌కుండా పెళ్లి చేసుకున్నాడు.

కార్తీ :
తమిళ హీరో సూర్య తమ్ముడు అయిన కార్తీ కూడా సొంత మ‌ర‌దలినే పెళ్లాడారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news