సూపర్‌స్టార్ మహేష్‌బాబు కెరీర్ ఇప్పుడు జెట్ రాకెట్ స్పీడ్‌లో ఉంది. వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం మహేష్ పరశురాం దర్శకత్వంలో సర్కారువారిపాట సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మహేష్ నెక్ట్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. రాజకుమారుడు సినిమాతో దర్శకుడిగా మారిన మహేష్ తన కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశాడు.
ఇందులో హిట్ సినిమాలు ఉన్నాయి.. ప్లాప్ సినిమాలు ఉన్నాయి. ఏ హీరో అయినా కూడా సినిమా చేస్తున్నప్పుడు అది ప్లాప్ అవుతుందని అనుకుంటే చేయనే చేయడు.. అయితే కొన్ని సినిమాలు చేస్తోన్న టైంలోనే ఆ ఫలితం తేడా కొట్టేస్తుందని అర్థమవుతుంది. అయితే అప్పుడు ఆ సినిమాను వదల్లేని పరిస్థితి. అయిష్టంగానే ఆ సినిమాను పూర్తి చేస్తారు. సినిమా చేస్తోన్న టైంలోనే ప్లాప్ అవుతాయని తెలిసిన సినిమాలు మహేష్ కెరీర్‌లో రెండు ఉన్నాయట. ఆ రెండూ బ్రహ్మోత్సవం, స్పైడర్.
అప్పటికే మురుగదాస్‌కు అభిమానిగా ఉన్న మహేష్ ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ముందునుంచే అనుకున్నాడు. మురుగదాస్ సినిమా చేద్దాం అని చెప్పిన వెంటనే కథ కూడా వినకుండా ఓకే చెప్పేశాడు. ఆ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. ఆ సినిమా షూటింగ్ సగం కంప్లీట్ అయ్యాక మహేష్‌కు రిజల్ట్ తేడా కొట్టేస్తుందని క్లారిటీ వచ్చేసిందట. అయితే చేయడానికేం లేకపోవడంతో కంప్లీట్ చేశాడు. మహేష్ అనుకున్నట్టుగానే స్పైడర్ ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది.
ఇక సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాలతో బ్రహ్మోత్సవం చేశాడు. శ్రీమంతుడు షూటింగ్ క్లైమాక్స్‌లో ఉండగా.. ఫ్యామిలీ స్టోరీ అని ఒక్క మాట చెప్పిన వెంటనే శ్రీకాంత్‌పై నమ్మకంతో ఓకే చెప్పేశాడు మహేష్. అయితే ఆ సినిమా సగం పూర్తయ్యాక అసలు ఏ సీన్ ఎలా తీస్తున్నారో కూడా అర్థం కావడం లేదట. అప్పుడు కాని ఆ స్క్రిఫ్ట్ పూర్తి కాలేదన్న విషయం మహేష్‌కు తెలిసిందట. అలా ఈ రెండు సినిమాల ఫలితం మహేష్‌కు ముందే తెలిసినా చేసేదేం లేకపోవడంతో అయిష్టంగానే కంప్లీట్ చేశారు. అలా ఆ రెండు డిజాస్టర్లు అయ్యాయి.