Moviesబ‌న్నీ భార్య స్నేహ గురించి ఈ విష‌యాలు తెలుసా...!

బ‌న్నీ భార్య స్నేహ గురించి ఈ విష‌యాలు తెలుసా…!

మెగా హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పుష్ప సినిమా కేవ‌లం తెలుగులో మాత్ర‌మే కాదు… ఇటు త‌మిళంలోనూ, అటు హిందీలోనూ ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా హిందీలో రిలీజ్ అయిన పుష్ప ఇప్ప‌టికి ఓటీటీలో వ‌చ్చేసినా కూడా ఏకంగా రు. 85 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక త‌మిళంలో కూడా ఇప్ప‌టికే రు. 30 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమా గ్రాస్ వ‌సూళ్లే రు. 250 కోట్ల పై చిలుకు ఉన్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి.

ఇక బ‌న్నీ న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన స్నేహారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియాలోనూ బ‌న్నీ భార్య స్నేహ‌కు విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. ఆమె నిత్యం త‌న అభిమానుల‌కు ట‌చ్‌లో ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడూ లేటెస్ట్ అప్‌డేట్స్ ఇస్తూ ఉంటుంది. ఇక స్నేహారెడ్డి ఎవ‌రు ? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటో ? తెలుసుకోవాల‌న్న ఆస‌క్తి చాలా మందిలో ఉంటుంది.

స్నేహ 1985 సెప్టెంబర్ 29 న జన్మించారు. ఆమె వ‌య‌స్సు 36 సంవ‌త్స‌రాలు. వీరి స్వ‌స్థ‌లం న‌ల్ల‌గొండ జిల్లా అయినా కూడా హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డ్డారు. స్నేహా తండ్రి ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌. వీరికి కాలేజ్‌లు ఉన్నాయి. పెళ్లికి ముందు స్నేహ ఆ కాలేజ్‌ల బాధ్య‌త చూసుకునేవారు. స్నేహ తండ్రి ప్ర‌భాక‌ర్ రెడ్డి ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌లో ఉన్నారు. ఆయ‌న 2014లో ఇబ్ర‌హీంప‌ట్నం నుంచి టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమె త‌ల్లి పేరు క‌వితారెడ్డి. స్నేహ‌కు మ‌రో సోద‌రి కూడా ఉన్నారు. స్నేహారెడ్డి ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు.

స్నేహ ఫేవ‌రెట్ హీరో బ‌న్నీ కాగా, ఫేవ‌రెట్ హీరోయిన్ ఆలియాభ‌ట్‌. స్నేహ సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు ఏకంగా నాలుగు మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఆమె ఫిట్‌నెస్‌తో పాటు అందం, ఆరోగ్యం విష‌యంలో శ్ర‌ద్ధ తీసుకుంటారు. ఆమె రెగ్యుల‌ర్‌గా వ‌ర్క‌వుట్లు చేయ‌డంతో పాటు యోగా కూడా చేస్తూ హీరోయిన్ల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ను అన్న‌ట్టుగా ఉంటారు. అలాగే త‌న పిల్ల‌లు అయాన్‌, అర్హ‌ల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోవ‌డంతో పాటు ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌లో బిజీగా ఉంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news