స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నాడు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయిన పాన్ ఇండియా మూవీ “పుష్ప” తో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేశాడు. అంతేకాకుండా రెస్ట్ లేకుండా సినిమాల మీద సినిమాలు అనౌన్స్ చేస్తూ.. అభిమానుల్నిఫుల్ ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధమౌతున్నారు. ఒక సినిమా మొదలుపెట్టక ముందే.. మరో సినిమాకి సైన్ చేస్తూ మరింత స్పీడ్ పెంచేస్తున్నాడు బన్నీ. దీంతో రాఉన్న రోజుల్లో బన్నీ హవా మరింత పెరగనున్నట్లు తెలుస్తుంది.
జనరల్ గా బన్నీ చాలా సరదాగా మాట్లాడుతాడు. ఆయన తో పనిచేసే నటీనటులు అయితే బన్నీని ఓ రేంజ్ లో పొగిడేస్తారు. ఫ్రెండ్లీ గా ఉంటాడని..సరదాగా మాట్లాడుతాడని..స్టార్ హీరోలానే బీహెవ్ చేయడాని..ఆయన సెట్ లో ఉంటె అందరికి జోష్ వస్తుందని అంటుంటారు ఆయనతో వర్క్ చేసిన నటులు. ఇక హీరోయిన్లు కూడా అంటె ఇప్పటికి వరకు బన్నీ అవ్ర్క్ చేసిన అందరు హీరోయిన్లు ఆయనకు ఫేవర్ గానే మాట్లాడారు. మంచి మనసు అని, ఆయనతో నటిస్తే యాక్టింగ్ స్కిల్స్ పెరుగుతాయని ..బన్నీ తో వర్క్ చేయడం లక్కి అని ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు.
కానీ, ఓ హీరోయిన్ మాత్రం బన్నీ మాటలకు బాధపడ్డిందట. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా గుర్తుంది కదా. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన అను ఇమ్మాన్యుల్ ని బన్నీ తన మాటలతో బాధపెట్టాడట. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు ఇలియాని ని అనుకున్నారట వక్కంతం వంశీ . ఎందుకంటే ఇలియానా-బన్నీ జంటకు ఫ్యాన్స్ లో ఫాలోయింగ్ బాగానే ఉంది. కానీ అప్పటికే ఇలియాని ఫెడ్ అవుట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడం..అప్పటికే అను ఇమ్మాన్యుల్ నాని తో మజ్ఞు సినిమాతో హిట్ కొట్టడం లో మచి ఫాంలో ఉన్న ఈమెను సెలక్ట్ చేసుకున్నారట. కానీ తెర పై వీళ్ల జోడీ పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.
దీంతో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుల్ వద్దు అని బన్నీ ముందే చెప్పాడట. కానీ డైరెక్టర్ బన్నీ ని బలవంతంగా ఒప్పించి ఆమెను హీరోయిన్ గా పెట్టారట. ఇక సినిమా ఫ్లాప్ అయ్యక ఈ విషయం అను ఇమ్మాన్యుల్ కి తెలిసి బాధపడ్డిందట. సినిమా హిట్ అయితే సక్సెస్ హీరో తీసుకుంటాడు..ఫ్లాప్ అయితే హీరోయిన్ మీదకు నెట్టెస్తారా అంటూ కన్నీళ్ళు పెట్టుకుందట. ప్రస్తుతం అను ఇమ్మాన్యుల్ చేతిలో చెప్పుకొతగ్గిన సినిమాలు లేకపోవడం గమనార్హం.