Moviesమొద‌టి భ‌ర్త‌కు విడాకులు ఇచ్చి పెళ్ల‌యిన‌ స్టార్‌ను పెళ్లాడిన న‌టి..!

మొద‌టి భ‌ర్త‌కు విడాకులు ఇచ్చి పెళ్ల‌యిన‌ స్టార్‌ను పెళ్లాడిన న‌టి..!

లారా ద‌త్తా మిస్‌యూనివ‌ర్స్‌గా.. మోడ‌ల్‌గా, న‌టిగా మ‌న‌కు బాగా తెలిసిన వ్య‌క్తి. రెండు ద‌శాబ్దాల క్రితం ఆమెకు ఇండియాలో మంచి క్రేజ్ ఉండేది. లారా ద‌త్తా మిస్‌యూనివ‌ర్స్ అయ్యాక బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాల్లో న‌టించింది. ఆమెకు అప్ప‌ట్లో మోడ‌ల్‌గా మంచి డిమాండ్ ఉండేది. ఇక మ‌హేష్‌భూప‌తి టెన్నీస్ స్టార్‌. లియాండ‌ర్ పేస్‌తో క‌లిసి భార‌త్‌కు ఎన్నో సుమ‌ధుర విజ‌యాలు అందించాడు.

ఇక వీరిద్ద‌రి ప్రేమ పెళ్లి విచిత్రంగానే జ‌రిగింది. లారాద‌త్తా ముందు ముంబై టాప్ మోడ‌ల్ డినూమోరియోతో ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల‌కే ఈ జంట మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయి. దీంతో వీరు విడాకులు తీసుకున్నారు. అలా లారాద‌త్తా ఒంట‌ర‌య్యింది. ఇక మ‌హేష్ భూప‌తి ముందుగా 2022లో మోడ‌ల్ శ్వేతా జైశంక‌ర్‌ను పెళ్లాడాడు.

ఏడు సంవ‌త్స‌రాల వైవాహిక జీవితం అనంత‌రం వీరు విడాకులు తీసుకున్నారు. అయితే ఇక్క‌డ చాలా మంది మ‌రో కార‌ణం కూడా చెపుతారు. మ‌హేష్ లారాద‌త్తాతో ప్రేమ‌లో ఉండ‌డంతోనే శ్వేత‌కు విడాకులు ఇచ్చార‌ని చెపుతారు. అందుకే శ్వేత – మ‌హేష్ బంధాన్ని విడ‌గొట్టినందుకు లారాకు హోమ్ బ్రేక‌ర్ అన్న అప‌వాదు త‌ప్ప‌లేదు.

ఆ త‌ర్వాత లారాద‌త్తా – మ‌హేష్ కొద్ది రోజుల పాటు డేటింగ్ చేసుకుని 2011లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ఓ కుమార్తె కూడా క‌లిగింది. ఆ కుమార్తె పేరు సైరా. ఇక మ‌హేష్‌కు విడాకులు ఇచ్చాక త‌న మొద‌టి భార్య శ్వేత చైన్నైకు చెందిన ర‌ఘు కైలాస్ అనే వ్యాపార‌వేత్త‌ను పెళ్లాడింది. ఈ జంట‌కు ఇప్పుడు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news