నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా జాతర ఇంకా బాక్సాఫీస్ దగ్గర కంటిన్యూ అవుతూనే ఉంది. గత డిసెంబర్ 2వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా తాజాగా 103 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. మరో వైపు థియేట్రికల్‌గానే రు. 150 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా… నాన్ థియేట్రికల్ వసూళ్లు కూడా కలుపుకుంటే ఓవరాల్‌గా రు. 200 కోట్ల పై చిలుకు వసూళ్లు అఖండ సొంతం అయ్యాయి. ఇటీవలే డిస్నీ, హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన అఖండకు అక్కడ కూడా అదిరిపోయే వ్యూస్ వస్తున్నాయి.
ఏదేమైనా అఖండ జాతర, పూనకాల నుంచి ఇంకా తెలుగు ప్రేక్షకులు బయటకు రాలేదు.. అంతలా అఖండ మానియా కొనసాగుతోంది. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌ను తిరుగులేని బ్లాక్‌బస్టర్ హ్యాట్రిక్‌గా అఖండ ఫ్రూవ్ చేసింది. బాలయ్య మురళీకృష్ణ అనే రైతు పాత్రలోనే కాకుండా… అఘోరాగా నట విశ్వరూపం చూపించేశాడు. అఘోరా పాత్రను బాలయ్యే చేయాలి.. బాలయ్య తప్ప ఇంకెవరు చేయలేరు అన్నట్టగా విజృంభించేశాడు.
అఖండ మాసిజం ఉత్తరాంధ్ర ప్రజలకు కూగా బాగా నచ్చేసింది. అందుకే ఇతర భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇక కోలీవుడ్‌లో అఖండ రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. జనవరి 28వ తేదీన అఖండ తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా సైలెంట్‌గా డబ్బింగ్ కార్యక్రమాలు ఫినిష్ చేసేసి అక్కడ రిలీజ్ చేస్తున్నారు. థియేటర్లు కూడా భారీగానే దొరకడంతో బాలయ్య అక్కడ కూడా భారీ ఎత్తున గర్జించేందుకు రెడీ అవుతున్నాడు.
తమిళ రూరల్ జనాలకు మాస్ సినిమాలను పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ ప్రేక్షకులకు అఖండ బాగా కనెక్ట్ అవుతుందనే అంటున్నారు. తమిళంలో ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేవు. అక్కడ ప్రేక్షకులకు కనెక్ట్ కావాలే కాని.. అక్కడ కూడా మాస్ ర్యాంపేజ్ కంటిన్యూ అవుతుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఏదేమైనా బాలయ్య సినిమా అన్నీ భాషల్లో ఈ స్థాయి క్రేజ్ రావడంతో నందమూరి అభిమానుల జోష్ మామూలుగా లేదు.