టాలీవుడ్‌లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ స్వింగ్‌లో ఉన్నాడు. ఎన్టీఆర్ హీరో అయిన రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ వరుసగా ఐదు హిట్లు రాలేదు. టెంపర్ సినిమాకు ముందు వరకు ఎన్టీఆర్‌కు అన్నీ ప్లాపులే వచ్చాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2015లో వచ్చిన టెంపర్ సినిమా నుంచి ఎన్టీఆర్ రాత మారిపోయింది. చేసిన సినిమా అల్లా హిట్లే… ఇప్పటికే ఐదు వరుస హిట్లతో జోరు మీదున్న ఎన్టీఆర్ ఖాతాలో ఆరో హిట్ పడడం కూడా లాంఛనమే అని చెప్పాలి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తోన్న త్రిబుల్ ఆర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా హిట్ అయితే ఎన్టీఆర్ ఖాతాలో డబుల్ హ్యాట్రిక్ హిట్లు పడతాయి.
ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ కొరటాల శివ – త్రివిక్రమ్ – ప్రశాంత్ నీల్ సినిమాలను లైన్లో పెట్టాడు. ఇవన్నీ కూడా క్రేజీ ప్రాజెక్టులే. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ చిన్నప్పుడు బాల రామాయణం, బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలు చేశాడు. ఇక హీరోగా మారాక ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు నిర్మించిన నిన్ను చూడాలని సినిమా చేశాడు. ఇదే హీరోగా ఎన్టీఆర్‌కు తొలి సినిమా. 2001 మే 23న రిలీజ్ అయ్యింది. వంకినేని రత్నప్రతాప్ (వీఆర్. ప్రతాప్) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
రవీనా రాజ్‌పుత్ ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. చాలా కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. ఈ సినిమాలో నటించినందుకు గాను రామోజీరావు ఎన్టీఆర్‌కు రు. 4 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చాడట. ఇది ఎన్టీఆర్ తొలి రెమ్యునరేషన్. ఆ తర్వాత సింహాద్రి హిట్ అయ్యాక ఎన్టీఆర్‌కు రు. 3 కోట్ల రెమ్యునరేషన్ వచ్చింది. పదేళ్ల క్రితం రభస, రామయ్యా వస్తావయ్యా సినిమాలు చేసే టైంలో సినిమాకు రు. 6 – 7 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునేవాడు.
ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా కోసం ఏకంగా మూడేళ్ల పాటు మరో ప్రాజెక్టు చేయలేదు. ఈ సినిమా చేసినందుకు గాను నిర్మాత దానయ్య ఎన్టీఆర్‌కు రు.50 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా హిట్ అయ్యాక… ఎన్టీఆర్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. అప్పుడు ఎన్టీఆర్ మరింత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం ఖాయం.