Moviesస్టార్ హీరోయిన్ అవ్వాల్సిన ఈమె ఆ రాంగ్ స్టెప్‌ల‌తో ఫేడ‌వుట్ అయ్యిందే..!

స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన ఈమె ఆ రాంగ్ స్టెప్‌ల‌తో ఫేడ‌వుట్ అయ్యిందే..!

హీరోయిన్ ఇషాచావ్లా… మొద‌టి సినిమాతో మంచి హిట్ త‌న ఖాతాలో వేసుకుంది. సాయికుమార్ త‌న‌యుడు ఆది సాయికుమార్ ఫ‌స్ట్ సినిమా నువ్వేకావాలితో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. నువ్వేకావాలి ద‌ర్శ‌కుడు కె. విజ‌య్‌భాస్క‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా హిట్ అవ్వ‌డంతో తెలుగులో ఆమెకు మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి. ఆ త‌ర్వాత బాల‌య్య‌తోనే ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మ‌డు. బాల‌య్య హీరోగా వ‌చ్చిన శ్రీమ‌న్నారాయ‌ణ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన ఈ అమ్మ‌డు.. పూల‌రంగ‌డు, మిస్ట‌ర్ పెళ్లికొడుకు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది.

సునీల్ ప‌క్క‌న‌ పూలరంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు లాంటి రెండు సినిమాల్లో ఛాన్స్ వ‌చ్చింది. అయితే ఈమె చేసిన సినిమాలు అన్ని ప్లాప్ అయ్యాయి. బాల‌య్య‌తో వ‌చ్చిన ఆ ఛాన్స్ కూడా యూజ్ చేసుకోలేక‌పోయింది. ఆ సినిమా ప్లాప్ అవ్వ‌డంతో ఆమెను ఆ త‌ర్వాత ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. ఇక అందం ఉన్నా కూడా కేవ‌లం సినిమా ఛాన్స్ వ‌స్తే చాలు అని ఏ సినిమా ప‌డితే ఆ సినిమా ఒప్పేసుకోవ‌డంతోనే ఆమె స్టార్ హీరోయిన్ కాలేక‌పోయింది.

ఈ విష‌యంలో ఆమె చేసిన రాంగ్ స్టెప్‌తోనే ఆమె ఫేడ‌వుట్ హీరోయిన్ అయిపోయింది. క‌థ‌ల విష‌యంలో ఆమె జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉంటే ఆమె ఖ‌చ్చితంగా స్టార్ హీరోయిన్ అయ్యేది. ఆ త‌ర్వాత ఆమెకు ఛాన్సులు రాక‌పోయినా సోష‌ల్ మీడియాలో త‌న ఫొటోలు షేర్ చేస్తూ తాను ఇంకా లైన్లోనే ఉన్నాన‌ని చెప్పుకునేందుకు తాప‌త్ర‌య ప‌డుతుంది.

ఇక తాజాగా ఇషాచావ్లా క‌రోనా భారిన ప‌డింది. ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అంద‌రికి తెలియ‌జేయ‌డంతో పాటు తాను హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాన‌ని చెప్పింది. ఇక ప్ర‌తి ఒక్క‌రు కూడా క‌రోనా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌ల‌తో ఉండాల‌ని చెప్పింది. ఇక అభిమానులు, నెటిజ‌న్లు కూడా ఇషాచావ్లా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కామెంట్లు పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news