బేబీ షామిలి ఈ పేరు రెండున్నర దశాబ్దాల క్రితం తెలుగు ప్రేక్షకుల్లో ఓ సంచలనం. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో చిన్న పిల్ల గా నటించిన షామిలీ నటనకు తెలుగు జనాలు ఫిదా అయిపోయారు. తన క్యూట్ లుక్స్ తో పాటు ముద్దు ముద్దు మాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.. చిరంజీవిని రాజు అంటూ ముద్దు మాటలొలికించిన షామిలీకి ఆ వయసులోనే ప్రత్యేకంగా అభిమాన గణం ఏర్పడింది.
1989లో తమిళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన షామిలి 199 లో మణిరత్నం దర్శకత్వం వహించిన అంజలి సినిమాలో చేసిన పాత్రను చాలా అవలీలగా పోషించి ఔరా అనిపించింది. ఆ సినిమాలో ఆమె నటనకు జాతీయ అవార్డు వచ్చింది. 42 సినిమాలకు పైగా ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ రోజుల్లోనే స్టార్ రేంజ్ లో ఆమె రెమ్యునరేషన్ అందుకునేది. షామిలి చిన్నపిల్లగా ఉన్నప్పుడే అద్భుతమైన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నా… హీరోయిన్ అయ్యాక మాత్రం ఆ సక్సెస్ కంటిన్యూ చేయలేకపోయింది.
షామిలి సిద్దార్థ్ హీరోగా వచ్చిన ఓయ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆమె యాక్టింగ్‌కు బాగా నెగటివ్ కామెంట్స్ వచ్చేశాయి. ఆ తర్వాత ఆమెకు ఆఫర్లు వచ్చినా కొంత గ్యాప్ తీసుకుంది. ఆమెకు ఆ తర్వాత హీరోయిన్ గా ఛాన్స్ లు రాలేదు. ఆ తర్వాత ఒకటి రెండు ఛాన్సులు వచ్చినా షూటింగ్ కు టైంకు రాక పోవడంతో పాటు…ఆమె గొంతెమ్మ కోర్కెలతో నిర్మాతలను ఆమె బాగా ఇబ్బంది పెట్టింది అని ప్రచారం జరిగింది.
ఇలాంటి సమయంలో ఏకంగా ధనుష్ పక్కన వచ్చిన ఆఫర్ కూడా ఆమె గొంతెమ్మ కోర్కెలతో పోగొట్టుకుంది. ఇక షామిలి అక్క షాలిని కూడా బాలనటిగానే ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. షామిలి మాత్రం చేజేతులా కెరీర్ నాశనం చేసుకుంది.