రమేష్‌వర్మ టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో ఉన్నా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిర రీమేక్ మూవీ రాక్షసుడు సినిమాతో మాంచి బ్రేక్ వచ్చింది. రీమేక్ మూవీ అయినా కూడా ఇది తెలుగులో మాంచి యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత కాస్త లాంగ్ గ్యాప్ తీసుకున్న ఆయన రవితేజ హీరోగా ఖిలాడీ సినిమాను తెరకెక్కించాడు. క్రాక్ సినిమా తర్వాత మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఖిలాడీ సినిమా రవితేజ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కడంతో పాటు తిరుగులేని ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది.
ఈ సినిమాను కోనేరు హవీష్, కోనేరు సత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా రు. 60 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కడంతో పాటు రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్ లాభాలు పొందడం ట్రేడ్ వర్గాల్లోనూ షాకింగ్‌గా మారింది. ఖిలాడీ సినిమాకు దాదాపు 60 కోట్లు ఖర్చయింది. సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా సక్సెస్ ఫుల్‌గా క్లోజ్ అవ్వడంతో నిర్మాతలు దర్శకుడు రమేష్‌వర్మకు ఏకంగా రేంజ్ రోవర్ కారు గిఫ్ట్‌గా ఇచ్చారు.
ఇంత బడ్జెట్ సినిమాను టేబుల్ ప్రాఫిట్ తో రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఇప్పుడు నాన్ థియేట్రికల్ రైట్స్ బాగా పెరిగాయి. దీంతో ఇంత బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఇక సినిమాను బయ్యర్లు అందరికి ముందుగానే చూపించి మరీ అమ్మడంతో కూడా సినిమాపై ధీమాతోనే ఎక్కువ రేట్లకు కొనుగోలు చేసినట్టు చెపుతున్నారు.
ఇక టాలీవుడ్‌లో సినిమాలు సక్సెస్ అయితే దర్శకులకు కార్లు బహుమతిగా ఇవ్వడం జరుగుతూనే ఉంది. గతంలో కూడా కొందరు దర్శకులు ఇలా కార్లు గిఫ్ట్‌గా అందుకున్నారు. వెంకీ కుడుముల – మారుతి – బుచ్చిబాబు సానాలు తమ సినిమాలు హిట్ అయ్యాక కార్లు గిఫ్టులుగా అందుకున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో రమేష్ వర్మ చేరిపోయాడు.