Moviesఇండియాలో ఆ రికార్డు బాల‌య్య ఒక్క‌డిదే... ఆ టాప్ రికార్డు ఇదే..!

ఇండియాలో ఆ రికార్డు బాల‌య్య ఒక్క‌డిదే… ఆ టాప్ రికార్డు ఇదే..!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ పేరు గ‌త రెండు నెల‌లుగా సోష‌ల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఆంధ్రా నుంచి అమెరికా వ‌ర‌కు ఎక్క‌డ చూసినా బాల‌య్య పేరే ఏదోలా సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ నానుతూ వ‌స్తోంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య న‌టించిన అఖండ సినిమా గ‌తేడాది డిసెంబ‌ర్ 2న రిలీజ్ అయ్యింది. తొలి రోజు డివైడ్ టాక్ తెచ్చుకున్న అఖండ ఆ త‌ర్వాత రెండో రోజు నుంచే బాక్సాఫీస్ మీద గ‌ర్జించింది. బాల‌య్య కెరీర్‌లో గ‌తంలో ఏ సినిమాకు రాన‌ట్టుగా రు. 150 కోట్ల థియేట్రిక‌ల్ గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టిన అఖండ ఓవ‌రాల్‌గా రు. 200 కోట్లు కొల్ల‌గొట్టింది.

ఇక అఖండ 103 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోగా… ఈ సినిమా జ‌న‌వ‌రి 21 డిస్నీ, హాట్‌స్టార్‌లో కూడా స్ట్రీమింగ్ అయ్యింది. ఓవ‌రాల్‌గా అఖండ‌కు రు. 75 కోట్ల షేర్ వ‌చ్చింది. ఈ క‌రోనా టైంలో ఓ సినిమాకు రు. 20 కోట్ల షేర్ రావ‌డం అఖండ‌తో మాత్ర‌మే సాధ్య‌మైంది. తాజాగా అఖండ త‌మిళంలో కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా త‌మిళ్ వెర్ష‌న్ రైట్స్‌ను రు. 60 ల‌క్ష‌ల‌కు అమ్మారు. అక్క‌డ ఈ సినిమా ఎక్కువ థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది.

ఇక డిస్నీ హాట్‌స్టార్‌లో రిలీజ్ అయిన అఖండ తొలి 24 గంట‌ల్లోనే ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకున్న సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది. అలాగే ఫ‌స్ట్ వీక్‌లో కూడా అఖండ‌ను హాట్ స్టార్‌లో ఎక్కువ మంది చూశారు. ఫ‌స్ట్ వీక్‌లో కూడా అఖండ టాప్ ప్లేసులో ఉంది. వారం రోజుల పాటు హాట్‌స్టాప్ అప్లీకేష‌న్‌లో టాప్ ప్లేసులో ఉన్న అఖండ ఇండియాలోనే అరుదైన రికార్డు త‌న ఖాతాలో వేసుకుంది. ఈ రికార్డు బాల‌య్య ఒక్క‌డికే సాధ్య‌మైంది.

వారం రోజుల పాటు ఓ సినిమా హాట్‌స్టాప్ అప్లీకేష‌న్ ఫ‌స్ట్ ప్లేసులో ఉండ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యాక హాట్ స్టార్‌కు సబ్‌స్క్రిప్ష‌న్లు పెర‌గ‌డంతో కూడా వారు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఏదేమైనా 60 రోజులు వ‌చ్చినా కూడా అఖండ జాత‌ర ఆగ‌డం లేదు. ఇక బాల‌య్య త‌న నెక్ట్స్ సినిమాను మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు. మైత్రీ మూవీస్ వాళ్లు నిర్మిస్తోన్న ఈ సినిమాలో శృతీహాస‌న్ హీరోయిన్‌. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news